https://oktelugu.com/

అప్పులు తీర్చేందుకు ఆస్తులమ్ముతున్న అంబానీ

హత విధీ.. పైసల కోసం పరిగెడితే ఎలా ఉంటుందో దేశంలో ఇద్దరు అన్నాదమ్ములను చూస్తే అర్థమవుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీన్ ను ఓ ఎత్తుకు చేర్చిన ఘనత ‘ధీరుభాయ్ అంబానీ’ది. ఆయన మరణం తర్వాత ముఖేష్, అనిల్ అంబానీల మధ్య పొరపొచ్చాలు వచ్చి కంపెనీలను సమంగా పంచేశారు. అయితే తండ్రి కష్టసుఖాల్లో తోడుగా ఉండి వ్యాపార కిటుకులు తెలుసుకున్న ముఖేష్ అంబానీ ఇప్పుడు దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా ఎదిగి కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టించి ఏకంగా ఎవరికి అందనంతగా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 1, 2021 / 05:52 PM IST
    Follow us on

    హత విధీ.. పైసల కోసం పరిగెడితే ఎలా ఉంటుందో దేశంలో ఇద్దరు అన్నాదమ్ములను చూస్తే అర్థమవుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీన్ ను ఓ ఎత్తుకు చేర్చిన ఘనత ‘ధీరుభాయ్ అంబానీ’ది. ఆయన మరణం తర్వాత ముఖేష్, అనిల్ అంబానీల మధ్య పొరపొచ్చాలు వచ్చి కంపెనీలను సమంగా పంచేశారు.

    అయితే తండ్రి కష్టసుఖాల్లో తోడుగా ఉండి వ్యాపార కిటుకులు తెలుసుకున్న ముఖేష్ అంబానీ ఇప్పుడు దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా ఎదిగి కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టించి ఏకంగా ఎవరికి అందనంతగా సంపద పోగేసుకుంటున్నాడు.

    అదే సమయంలో అన్న నుంచి విడిపోయిన తమ్ముడు అనిల్ అంబానీ వ్యాపార నిర్వహణలో ఘోరంగా విఫలమై అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు కుప్పలై ఇప్పుడు తీర్చేదారి లేక వరుసగా ఆస్తులు అమ్ముకుంటున్న దుస్థితిలోకి దిగజారాడు.

    ప్రస్తుతం పరిస్థితి ఎలా అయ్యిందంటే.. రిలయన్స్ సామ్రాజ్యానికి కేంద్రబిందువైన ముంబైలోని హెడ్ ఆఫీస్ ను సైతం అనిల్ అంబానీ అప్పుల కింద యెస్ బ్యాంకుకే అమ్మేశాడు. . ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు అప్పు తీర్చే పనిలో భాగంగా తన వేలకోట్ల ఆస్తిని అంబానీ విక్రయించారు. తన నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన ఆస్తిని బ్యాంకుకే ఇచ్చేశాడు. దాదాపు 1200 కోట్ల రూపాయలకు అమ్మేయగా.. ఈ ముంబైలోని అతిపెద్ద అంబానీ ఆస్తిని తన కార్పొరేట్ హెడ్ ఆఫీస్ గా యెస్ బ్యాంకు మార్చేసింది.

    ఇప్పటికే అంబానీ దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులను అమ్మేసుకుంటూ అప్పులు తీర్చేస్తున్నాడు. ఢిల్లీలోని ఆస్తిని 3600 కోట్లకు అమ్మగా.. పర్బతి ఆస్తిని 900 కోట్లకు విక్రయించాడు. తాజా విక్రయంతో యెస్ బ్యాంకు అప్పు తీర్చాడు. చివరకు జీరోగా మిగిలిపోతాడేమోనన్న ఆందోళన వ్యాపార వర్గాల్లో ఉంది.