https://oktelugu.com/

షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కు తీవ్ర గాయాలు !

వైవిధ్యమైన హీరో  ధనుష్ సినిమా షూటింగ్ లో  ప్రముఖ  నటుడు ప్రకాష్ రాజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.   ప్రకాష్ రాజ్ చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి.  ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో ప్రకాష్ రాజ్ కు  శస్త్రచికిత్స జరగనుంది.  ప్రస్తుతం ధనుష్ తన 43వ సినిమా షూటింగ్‌ చెన్నైలో జరుగుతుంది.  త్యాగరాజన్ సమర్పణలో ఈ సినిమా రానుంది.  ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే,  ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్  చేస్తున్న క్రమంలో   ప్రకాష్ రాజ్ కి గాయాలు అయ్యాయని  తెలుస్తోంది. […]

Written By: admin, Updated On : August 10, 2021 4:22 pm
Follow us on

Prakash Raj Injured

వైవిధ్యమైన హీరో  ధనుష్ సినిమా షూటింగ్ లో  ప్రముఖ  నటుడు ప్రకాష్ రాజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.   ప్రకాష్ రాజ్ చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి.  ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో ప్రకాష్ రాజ్ కు  శస్త్రచికిత్స జరగనుంది.  ప్రస్తుతం ధనుష్ తన 43వ సినిమా షూటింగ్‌ చెన్నైలో జరుగుతుంది.  త్యాగరాజన్ సమర్పణలో ఈ సినిమా రానుంది.  ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే,  ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్  చేస్తున్న క్రమంలో   ప్రకాష్ రాజ్ కి గాయాలు అయ్యాయని  తెలుస్తోంది. అయితే, చేతికి మాత్రమే  గాయాలు అయ్యాయి,  ఇక ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.  ఈ వార్త వినగానే  ప్రకాష్ రాజ్ అభిమానులు సన్నిహితులు అందోళన చెందుతున్నారు. కానీ భయపడాల్సిన పని లేదని ఆ సినిమా యూనిట్ చెబుతుంది. 

ఇక  ధనుష్  చేస్తోన్న  ఈ సినిమాకి   జీవీ ప్రకాశ్ కుమార్  సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గానే   ఈ సినిమాకు సంబంధించి.. ఫస్ట్‌లుక్‌ను జులై 28వ తేదీ   విడుదల చేసింది  చిత్రబృందం. సినిమాలో ధనుష్ లుక్ బాగా ఆకట్టుకుంది.  అలాగే ప్రకాష్ రాజ్ లుక్ కూడా  చాలా కొత్తగా ఉంటుంది.  అయితే,  ప్రకాష్ రాజ్ కి ప్రమాదం జరగడంతో ఈ సినిమా షూటింగ్ కి  ప్రస్తుతానికి అయితే  బ్రేక్ ఇచ్చారు. 

అన్నట్టు  ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్   కోసం అభిమానులతో పాటు  ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
https://twitter.com/prakashraaj/status/1425025005641887749