https://oktelugu.com/

మహేష్ కోసం భారీ క్యూ.. దర్శకుల పోటీ?

టాలీవుడ్ సూపర్ స్టార్.. అందగాడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో ఆయనకు విషెస్ తెలియజేయడానికి పోటీపడ్డారు. ఇక టాలీవుడ్ లోని దర్శకులంతా మహేష్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేసి మరో సినిమా చేయబోతున్నామని ప్రకటించారు. ఇప్పటికే మహేష్ బాబు చేతిలో మూడు సినిమాలున్నాయి. ప్రస్తుతం ‘సర్కారివారి పాట’ పూర్తి చేసే పనిలో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 10, 2021 / 03:48 PM IST
    Follow us on

    టాలీవుడ్ సూపర్ స్టార్.. అందగాడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో ఆయనకు విషెస్ తెలియజేయడానికి పోటీపడ్డారు. ఇక టాలీవుడ్ లోని దర్శకులంతా మహేష్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేసి మరో సినిమా చేయబోతున్నామని ప్రకటించారు.

    ఇప్పటికే మహేష్ బాబు చేతిలో మూడు సినిమాలున్నాయి. ప్రస్తుతం ‘సర్కారివారి పాట’ పూర్తి చేసే పనిలో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. అనంతరం నిన్న బర్త్ డే సందర్భంగా మహేష్ తో త్రివిక్రమ్ మూవీని అనౌన్స్ చేశాడు. ఆ సినిమా అయిపోగానే దర్శకధీరుడు రాజమౌళితో సినిమా ఉండనే ఉంది.

    ఈ మూడు సినిమాలు పూర్తయ్యాకనే మహేష్ డేట్స్ ఖాళీ అయ్యేవి. అప్పటివరకు ఆయన ఖాళీగా లేరు. అయితే నవతరం దర్శకుల క్యూ మాత్రం భారీగా ఉంది. మహేష్ తో ఇదివరకు సినిమా చేసి రెండో సినిమా కోసం లైన్లో ఉన్న అనిల్ రావిపూడి, వంశీ పైడిపెల్లిలు కథలతో రెడీగా ఉన్నా ఇప్పటికిప్పుడు మహేష్ బాబు చేసే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికే వంశీ కథను రిజెక్ట్ చేయడంతో ఆయన మరోసారి మంచి కథతో రెడీ అవుతున్నాడు.

    వీళ్లిద్దరే కాదు.. కొత్త దర్శకులు బాబీ కూడా మహేష్ కోసం ఒక కౌబాయ్ కథను రాసుకున్నాడట.. గోపీచంద్ మలినేని సైతం మహేష్ తో ఒక మాస్ సినిమా కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట.. ఇక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సైతం మహేష్ తో ఏకంగా ప్యాన్ ఇండియా సినిమా కోసం ట్రై చేస్తున్నాడు. మహేష్ కు ఇప్పటికే కథ కూడా చెప్పాడట..

    ఇలా ఐదారుగురు దర్శకులు తమ కలల హీరో మహేష్ బాబు కోసం కథలు రెడీ చేసి రెడీగా ఉన్నా.. ప్రస్తుతానికి విని చేసేంత తీరిక టైం మహేష్ కు లేవు. రాజమౌళితో సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో కనుక హిట్ అయితే ఇక మహేష్ బాబు ఓవర్ నైట్ దేశీయంగా స్టార్ అయిపోతాడు. అప్పుడు ఈ దర్శకులకు చాన్స్ దొరుకుతుందో లేదో మరీ..