
వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. 54,461 పాయింట్లతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 54,780 వద్ద సరికొత్త ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 16,359 వద్ద ట్రేడ్ అయ్యింది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణ కు మొగ్గుచూపడంతో సూచీలు డీలాపడ్డాయి. చివరకు సెన్సెక్స్ 151,81 పాయింట్లు లాభంతో 54,554.66 వద్ద, నిఫ్టీ 21.80 పాయింట్లు లాభపడి 16,280.10 వద్ద స్థిరపడ్డాయి. రంగాల వారీగా ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి.