https://oktelugu.com/

‘పూజా హెగ్డే’ కొత్తగా.. ఆచార్య కోసమే !

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ అనగానే తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చినట్టు అనిపించింది. ఆ తరువాత వీరితో పాటు ఆచార్యలో మెగా పవర్ స్టార్ కూడా జాయిన్ అవుతున్నాడు, చరణ్ – చిరు కలయికలో అద్భుతమైన సీన్స్ ఉన్నాయని తెలియడంతో మొత్తానికి సినిమా లవర్స్ మైమరిచిపోయారు. ఇలాంటి కిక్ లో ఉన్నప్పుడు ఈ సినిమా నుండి సడెన్ గా వచ్చిన మరో క్రేజీ అప్ డేట్ టాల్ బ్యూటీ […]

Written By:
  • admin
  • , Updated On : March 24, 2021 / 09:40 AM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ అనగానే తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చినట్టు అనిపించింది. ఆ తరువాత వీరితో పాటు ఆచార్యలో మెగా పవర్ స్టార్ కూడా జాయిన్ అవుతున్నాడు, చరణ్ – చిరు కలయికలో అద్భుతమైన సీన్స్ ఉన్నాయని తెలియడంతో మొత్తానికి సినిమా లవర్స్ మైమరిచిపోయారు. ఇలాంటి కిక్ లో ఉన్నప్పుడు ఈ సినిమా నుండి సడెన్ గా వచ్చిన మరో క్రేజీ అప్ డేట్ టాల్ బ్యూటీ ‘పూజా హెగ్డే’ ఈ సినిమాలో చరణ్ సరసన నటిస్తోందని.

    Also Read: టాలీవుడ్ పై పిడుగు: తెలంగాణలో థియేటర్లు మళ్లీ బంద్?

    ఒకరకంగా పూజాకి ఇది గోల్డన్ ఛాన్స్ అయినా.. ప్రస్తుతం ఆమె ఉన్న బిజిలో ఈ సినిమా పెద్ద తలకాయ నెప్పి అయిందట. టాలీవుడ్ లోనే వెరీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తిరుగులేని స్టార్ డమ్ తో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా.. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఎవరి సినిమా వదిలిపెట్టాలి, ఎవ్వరికీ నో చెబితే.. ఏం ఫేస్ చేయాలి ఇలా ఫుల్ టెన్షన్ లో ఉందట. ఇంతగా పూజా క్లారిటీ లేకుండా మిగిలిపోవడానికి మెయిన్ కారణం.. బాలీవుడ్ సినిమాల్లో కూడా ఫుల్ బిజీగా ఉండటమేనట.

    Also Read: రానాకు గట్టి షాక్.. ‘అరణ్య’ మూవీ విషయంలో భారీ దెబ్బ

    కాగా ఈ ‘ఆచార్య’ సినిమాలో ‘పూజా హెగ్డే’ పాత్ర చనిపోతుందని.. తానూ ప్రేమించిన వ్యక్తి చనిపోయాడని తెలిసిన వెంటనే ఆత్మహత్య చేసుకుంటుందని.. ఓవరాల్ గా ఈ సినిమాలో కొత్త పూజాని చూస్తాం అంటున్నారు మేకర్స్. మరి చూద్దాం.. పూజాలో మేకర్స్ చెప్పినట్టు ఏ రేంజ్ కొత్తదనం ఉంటుందో. నిజానికి తనకు డేట్స్ కుదరకపోయినా.. ప్రస్తుతం చేస్తోన్న సినిమాల మేకర్స్ ను రిక్వెస్ట్ చేసుకుని మరీ ఆచార్య కోసం డేట్స్ కేటాయించింది పూజా. ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్