
చేతికి మైక్ దొరికిందంటే తాను రాజకీయ చాణక్యుడినని.. తనది నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం అని చెప్పుకొస్తుంటారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. అవును మరి ఆయన చెప్పే మాటల్లో ఎలాంటి పొరపాటు కూడా లేదు. తన సీనియారిటీని తాను చెప్పుకొస్తున్నారు. మరి ఎక్స్‌పీరియన్స్ ఉన్న చంద్రబాబు.. తన రాజకీయ జీవితం అంతా వయసు కూడా లేని జగన్ చేతిలో ఎందుకు డక్కీమొక్కీలు తింటున్నారో ఎవరికీ అంతుబట్టని విషయం.
రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పటికే జాతీయ స్థాయిలో రాణించాలి. ప్రత్యర్థిని గడగడలాడించాలి. ప్రజల్లోనూ ఆయనపై ఆ స్థాయిలో నమ్మకం కలగాలి. కానీ.. ఆ స్థాయి నమ్మకం లేకనే గత సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. టీడీపీ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమిని మూటగట్టుకున్నారు. బంపర్ మెజార్టీతో జగన్ అధికారంలోకి వచ్చారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబు వైసీపీ పోరాడుతూనే ఉన్నారు.
రాజకీయంగా ఏదైనా చేసే చంద్రబాబు.. జగన్ విషయంలో మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడు. జగన్ వ్యూహాల ముందు చంద్రబాబు తెలివి ఏ మాత్రం పనిచేయకుండాపోతోంది. జగన్‌కు పెద్దగా రాజకీయ అనుభవం లేకున్నా.. ఇప్పుడు జన బలం ఆయనకు అండగా ఉంది. అందుకే.. ఏ ఎన్నికల్లో అయినా ఏకపక్ష ఫలితాలే వస్తున్నాయి. ఈ పంథానే మరికొన్ని ఏండ్లపాటే సాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి.
మరోవైపు.. చంద్రబాబు వయసు కూడా ఆయనకు సహకరించడం లేదనేది తెలుస్తోంది. దీనికితోడు తెలుగుదేశం పార్టీలో సెకండ్ లీడర్ అనే వారు లేరు. అది కూడా ఆయనకు పెద్ద మైనస్. ఎన్నికలు ఏవైనా చంద్రబాబు ఒక్కరే ప్రచార బరిలోకి దిగాల్సిన పరిస్థితే ఉంది. కానీ.. ఇప్పుడు జనం ఎవరూ ఆయనను నమ్మే స్థితిలో లేరనేది వాస్తవం. దీనికితోడు వరుస ఓటములు ఆయనను కుంగదీస్తున్నాయి. ఇటు వరుస ఓటములతో క్యాడర్ కూడా చిన్నబోతోంది. పార్టీ నేతలు కూడా అందుకే పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
ఇక ఛాన్స్ దొరికిందంటే చంద్రబాబు వెళ్లి హైదరాబాద్‌లో మకాం పెడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన పార్టీని ఏపీలో అయినా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ.. అలా చేయకుండా వచ్చి హైదరాబాద్‌లో ఉంటుండడంతో అక్కడి నేతల్లో నమ్మకం పోతోంది. అందుకే.. బాబు అధికారంలో ఉన్నప్పుడు చూపిన విధేయతను ఇప్పుడు కింది స్థాయి క్యాడర్ చూపడం లేదనే తెలుస్తోంది. దీనికితోడు కొన్ని రోజుల పాటు చంద్రబాబు రెస్ట్ తీసుకోబోతున్నారానే టాక్ నడుస్తోంది. ఇక కొత్తగా రిఫ్రెష్ అయి తర్వాత యాక్టివ్ అయ్యేందుకు రెడీ కాబోతున్నారనేది సమాచారం. చూద్దాం.. మున్ముందు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతోందో.