ఆ కుర్రాడి ప్రదర్శనకు పొంగిపోయిన ఎన్టీఆర్ !

అవి తెలుగు దేశం పార్టీ విజయాలతో వెలిగిపోతున్న రోజులు.. ఎన్టీఆర్ అంటే దేవుడు అనే స్థితి ఉన్న రోజులు అవి. అయితే ఓ కుర్రాడికి చిన్న తనం నుండి ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ లు వేయడం అలవాటు. అలాగే ఎన్టీఆర్ ను అనుకరించి మాట్లాడటం కూడా చేస్తుంటాడు. అతనికి ఉన్న ఆ అలవాటు కారణంగా.. ఓ రాజకీయ మీటింగ్ కి అతన్ని పట్టుకెళ్లారు తెలుగు దేశం వాళ్ళు. నల్గొండలో రాజకీయ మీటింగ్ మొదలవడానికి సమయం పట్టేలా ఉంది. […]

Written By: admin, Updated On : June 21, 2021 3:55 pm
Follow us on

అవి తెలుగు దేశం పార్టీ విజయాలతో వెలిగిపోతున్న రోజులు.. ఎన్టీఆర్ అంటే దేవుడు అనే స్థితి ఉన్న రోజులు అవి. అయితే ఓ కుర్రాడికి చిన్న తనం నుండి ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ లు వేయడం అలవాటు. అలాగే ఎన్టీఆర్ ను అనుకరించి మాట్లాడటం కూడా చేస్తుంటాడు. అతనికి ఉన్న ఆ అలవాటు కారణంగా.. ఓ రాజకీయ మీటింగ్ కి అతన్ని పట్టుకెళ్లారు తెలుగు దేశం వాళ్ళు. నల్గొండలో రాజకీయ మీటింగ్ మొదలవడానికి సమయం పట్టేలా ఉంది.

ఎన్టీఆర్ గారి కోసం జనం బారులు తీరారు. ఎన్టీఆర్ వచ్చే లోపు జనాన్ని అలరించాలి. వేదిక మీదకు భయంభయంగా వచ్చాడు ఆ కుర్రాడు. తనకొచ్చిన ప్రదర్శన చేశాడు. ఆ ప్రదర్శన చూసిన చంద్రబాబు నాయుడు ఆశ్చర్యపోయారు. కుర్రాడిలో మంచి మ్యాటర్ ఉంది. మన మహానాడులో కూడా ఇతని చేత ప్రదర్శన చేయించండి అని చెప్పి వెళ్లిపోయారు.

అక్కడనుండి ఆ కుర్రాడు తెలుగు దేశం పార్టీ అఫీస్ లోనే మకాం మార్చాడు. పైగా మహానాడులో మొదటిసారి ఇచ్చిన ప్రదర్శనతోనే ఎంతో అకట్టుకున్నాడు. ఇక అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఊరు ఊరు తిరిగి చాటి చెప్పాడు. ఈ క్రమంలో ఓ సభలో ఆ కుర్రాడి ప్రదర్శన చూసిన ఎన్టీఆర్, సభ అయిపోయిన తరువాత నేరుగా ఆ కుర్రాడు దగ్గరికి వచ్చాడు.

ఆ కుర్రాడు అంత దగ్గరగా గతంలో ఎప్పుడూ ఎన్టీఆర్ ని చూడలేదు. అలానే చూస్తుండు పోయాడు. ఎన్టీఆర్ ఆ కుర్రాడు భుజం పై చేయి వేసి.. ‘మీ సేవలు మా కెంతో అవసరం బ్రదర్’ అని చెప్పి చంద్రబాబు నాయుడు వైపు తిరిగి ‘వీరు మన మనిషి. వీరిని ఇక నుండి మనతో పాటే ఉంచండి’ అని ఆ కుర్రాడి భుజం పై మరోసారి ప్రేమగా నిమిరి అక్కడ నుండి బయలుదేరారు.

ఈ కుర్రాడు మాత్రం, తనతో ఎన్టీఆర్ గారు మాట్లాడారు అనే షాక్ లో అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే.. హాస్య నటుడు వేణు మాధవ్. చిన్న తనంలోనే వేణు మాధవ్ కి తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అండ లభించడంతోనే అది వేణు మాధవ్ జీవితంలో ఎదగడానికి ఎంతో ఉపయోగపడింది. వేణు మాధవ్ హిమాయత్‌నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా కొన్నాళ్ళు పాటు ఉద్యోగం కూడా చేశాడు.