చరిత్రలో నిలిచిపోయిన తెలుగు చిత్రం !

తెలుగు కథకు అగ్రతాంబూలం.. ఇది ఇప్పుడు అతిశయోక్తి ఏమో.. కానీ, గతంలో.. అనగా సీనియర్ ఎన్టీఆర్ నాటి కాలం.. తెలుగు కథకుడికి ఒక గౌరవం ఉండేది. అప్పటి కొన్ని మన పాత తరం కథలకు ఇతర భాషల్లో విపరీతంగా డిమాండ్ ఉండేది. అయితే, ఆ తరువాత కాలంలో తెలుగు కథలు ఒక మూసలో ఇరుక్కుపోయాయి. మళ్లీ చాల సంవత్సరాల తరువాత ఆ మధ్య వచ్చిన ఓ చిన్న తెలుగు సినిమా విషయంలో అదే జరిగింది. తెలుగులో ల్ […]

Written By: admin, Updated On : March 23, 2021 5:06 pm
Follow us on


తెలుగు కథకు అగ్రతాంబూలం.. ఇది ఇప్పుడు అతిశయోక్తి ఏమో.. కానీ, గతంలో.. అనగా సీనియర్ ఎన్టీఆర్ నాటి కాలం.. తెలుగు కథకుడికి ఒక గౌరవం ఉండేది. అప్పటి కొన్ని మన పాత తరం కథలకు ఇతర భాషల్లో విపరీతంగా డిమాండ్ ఉండేది. అయితే, ఆ తరువాత కాలంలో తెలుగు కథలు ఒక మూసలో ఇరుక్కుపోయాయి. మళ్లీ చాల సంవత్సరాల తరువాత ఆ మధ్య వచ్చిన ఓ చిన్న తెలుగు సినిమా విషయంలో అదే జరిగింది. తెలుగులో ల్ సూపర్‌ హిట్‌ అయిన ఈ చిత్రం.. మిగిలిన భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది.

అయితే ఏదో నాలుగైదు భాషల్లోకి రీమేక్‌ అయి హిట్ అయితే సహజం అనుకోవచ్చు. కానీ 9 భాషల్లోకి రీమేక్ అయిన ఈ సినిమా అన్ని బాషల్లోనూ సూపర్ హిట్ అవ్వడం నిజంగా గొప్ప విషయమే. మరి తెలుగు తెరపైకి వచ్చి సంచలనం సృష్టించిన ఆ సినిమానే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. సిద్ధార్థ్‌, త్రిష జంటగా ప్రభుదేవా తెరకెక్కించిన చిత్రమిది. సుమంత్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎం.ఎస్‌ రాజు నిర్మించిన ఈ సినిమా 2005 జనవరి 14న విడుదలై ఘన విజయం అందుకుని.. అద్భుతమైన కలెక్షన్స్ తో పాటు ఎమోషన్స్ ను కూడా జనరేట్ చేసిన గ్రేట్ ఎమోషనల్ ఫిల్మ్ ఇది.

ఇక కథ విషయానికి వస్తే.. ధనిక అబ్బాయి, పేద అమ్మాయి మధ్య సాగే ప్రేమ కథ ఇది. కథ రెగ్యులర్ అయినా కథలోని మెయిన్ ఎమోషన్ ప్రతి ఒక్కరిని హత్తుకుంటుంది. అలాగే సినిమాలో భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. మొత్తానికి 7 భారతీయ భాషల్లోకి, 2 విదేశీ భాషల్లోకి రీమేకైన ఏకైక తెలుగు చిత్రంగా ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోయింది.

మరి ఈ సినిమా ఏ భాషలో ఏ పేరుతో వచ్చిందో పరిశీలిద్దాం.
1. ఉనక్కం ఎనక్కం (తమిళం)
2. నీనెల్లో నానల్లే (కన్నడ)
3. ఐ లవ్‌ యు (బెంగాలీ)
4. నింగోల్‌ తజబ(మణిపురి)
5. సునా ఛాదీ మో రూపా ఛాదీ (ఒడియా)
6. తేరా మేరా కీ రిష్తా (పంజాబీ)