
బబ్లీ గర్ల్ ‘కియారా అద్వానీ’ ప్రసుతం పాన్ ఇండియా హీరోయిన్స్ లోనే ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్. నిజానికి అలియా భట్ కి కూడా తెలుగు తమిళ భాషల్లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, కియారాకి తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి మార్కెట్ ఉంది. తెలుగులో మహేష్, చరణ్ లాంటి స్టార్స్ పక్కన నటించడంతో అమ్మడికి బీసీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.
అయితే కియారా నటన విషయంలో పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా, యూత్ ను ఆకట్టుకోవడానికి కావాల్సినంత ఎక్స్ పోజింగ్ చేస్తూ.. సినిమాకి ఫుల్ గ్లామర్ ను అద్దగలదు. అందుకు తగ్గట్లుగానే అమ్మడు అందం కూడా అదుర్స్ అనిపిస్తోంది అనుకోండి. అందుకే, తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఏ హీరోయిన్ కి సాధ్యం కానీ ఫాలోయింగ్ తో ఈ బబ్లీ బ్యూటీ బాగానే క్యాష్ చేసుకుంటుంది.
నిజానికి ‘కియారా’ కంటే అందగత్తెలు ఇంకా సెకండ్ గ్రేడ్ లోనే నిలిచిపోతే.. కియారా మాత్రం రెండు సంవత్సరాల్లోనే స్టార్ హీరోయిన్ గా ప్రస్తుతం ఒక వెలుగు వెలిగుతుంది. అందుకేనేమో స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో కియారాకి వరుసగా అవకాశాలు ఇస్తూ.. ఆమెను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఐతే తానూ ఇంత బిజీగా ఉన్నా గ్లామర్ డోస్ ను మాత్రం రోజురోజుకూ పెంచుకుంటూ పోతుంది కియారా.
సోషల్ మీడియాలో ఈ మధ్య ‘కియారా’ పోస్ట్ చేస్తోన్న ఫొటోలన్నీ ఎక్కువగా గ్లామరస్ గానే ఉంటున్నాయని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్నా.. ఇంకా ఎందుకు తనలోని ఒంపుసొంపుల ప్రదర్శనను పరి పూర్ణంగా ప్రదర్శించాలి అని ఆమెను ప్రశ్నిస్తున్నారు ఆమె అభిమానులు. అయితే ఇవేమి తనకు పట్టవు అన్నట్టు ‘కియారా’ తాజాగా మళ్ళీ హాట్ ఫోటోలను షేర్ చేసి మొత్తానికి నెటిజన్లకు మంచి కిక్ ను ఇచ్చింది.