యువత ఎక్కువగా బైక్ రైడింగ్ లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వద్దని వారిస్తున్నా లెక్క చేయకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సాయిధరమ్ తేజ్ బైక్ రైడింగ్ పై ఉన్న మక్కువతోనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. దీనికి ఎవరు చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నరేష్ తేజ్ గురించి ఓ చిన్న వీడియో సందేశం విడుదల చేశారు. బైక్ రైడింగ్ చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఇద్దరు నాకు బిడ్డల్లాంటి వారే అని పేర్కొన్నారు. తేజ్, మా అబ్బాయిని హెచ్చరించాను బైక్ రైడింగ్ వద్దని. కానీ తేజ్ మాత్రం తన పద్దతి మార్చుకోలేదు.
తేజ్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్ లకు హాజరు కావాల్సిందిగా కోరుకున్నారు. ఇద్దరు వయసులో ఉన్నందున బైక్ రైడింగ్ వైపే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దీంతో జీవితం కొంత అలజడికి గురవడం జరుగుతోంది. లైప్ ను రిస్క్ లో పెడుతూ పెద్దవారికి కన్నీరు మిగుల్చుతున్నారు. ఈ పద్ధతి మారాలి. అందరిలో ఆలోచన పెరగాలి. తల్లిదండ్రులను చూసి వారు చెప్పింది విని తన వైఖరి మార్చుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.
సాయిధరమ్ తేజ్ పరిస్థితిపై సినీపరిశ్రమ వర్గాల నుంచి స్పందన వస్తోంది. ప్రమాదంలో గాయపడిన తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఎదుగుతున్న వయసులో ఇబ్బందులు పడడం తగదని సూచిస్తున్నారు. బైక్ రైడింగ్ లపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. రోడ్లన్ని వర్షాకాలం కావడంతో బుదరగా మారే అవకాశం ఉందని దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఎవరు కూడా సాహసాలు చేయొద్దని చెబుతున్నారు.