యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం అయోమయంలో పడిపోయాడు. వరుసగా మూడు సినిమాలు ఒప్పుకుని, ఇప్పుడు అవి పూర్తి చేయాలంటే.. తన ఓన్ ప్రొడక్షన్ లో జరుగుతున్న సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ హీరోకి. నిజానికి కరోనా సెకెండ్ వేవ్ ఉపద్రవాన్ని అసలు ఊహించని సినిమా జనం స్పీడ్ గా ఒకేసారి రెండు మూడు సినిమాలు ఒప్పుకుని అడ్డంగా బుక్ అయ్యారు.
మొదటి వేవ్ వల్ల టైం వేస్ట్ అయింది, కానీ సెకెండ్ వేవ్ వల్ల ప్రాణాలే పోయేలా ఉన్నాయి. అసలు రెండో వేవ్ కొంప ముంచుతుందని ఎవరూ అంచనా వేయలేకపోవడంతో సినిమా వాళ్ళు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అయితే మిగతా హీరోలతో పోల్చితే నాగశౌర్యకి ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం నాగశౌర్య నటిస్తున్న నాలుగు సినిమాలు రిలీజ్ దగ్గరే ఆగిపోయాయి.
ఎప్పుడో ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ‘వరుడు కావలెను’ సినిమాని వేసవి సెలవుల్లోనే విడుదలకు ప్లాన్ చేశారు. కరోనాతో పెద్ద బ్రేక్ పడింది. అలాగే, ‘లక్ష్య’ అనే మరో సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు శౌర్య. రెండో లాక్డౌన్ కారణంగా ఆ సినిమా రిలీజ్ పరిస్థితి ఇప్పట్లో తేలేలా లేదు. ఇక అవసరాల శ్రీనివాస్ తీస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ పరిస్థితి అయితే పూర్తి అయోమయంలో ఉంది.
నిర్మాత మహేష్ కోనేరు నిర్మిస్తున్న ‘పోలీస్ వారి హెచ్చరిక’ ప్రొడక్షన్ దశలో ఉంది. జూన్ నుండి శౌర్య ఈ సినిమా కోసం డేట్స్ ఇచ్చాడు. అయితే లక్ష్య సినిమాతో పాటు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా షూట్ కూడా బ్యాలెన్స్ ఉంది. కానీ ఈ రెండు సినిమాలకు డేట్స్ ఇవ్వాలి అంటే.. ఒప్పుకున్న రెండు సినిమాలను పక్కన పెట్టాలి. వాటిలో శౌర్య సొంత సినిమా ఉంది. ఈ సినిమా పోస్ట్ ఫోన్ చేస్తే ముందు నష్ట పోయేది శౌర్య ఫ్యామిలీనే. కానీ నష్టాలూ తప్పేలా లేవు