spot_img
Homeఅప్ కమింగ్ మూవీస్'RRR' release date out : ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై కొత్త  అప్...

‘RRR’ release date out : ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై కొత్త  అప్ డేట్ !

‘RRR’ release date out  : నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి  డైరెక్షన్ లో  ‘ఎన్టీఆర్ –  రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా మొత్తానికి   కొత్త  రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడానికి సిద్ధం అయింది. కరోనా థర్డ్‌ వేవ్‌  తో వాయిదా పడిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  తాజాగా  కొత్త విడుదల తేదీతో చిత్ర బృందం కొత్త పోస్టర్‌ ను రిలీజ్  చేసింది. 

star hero madhavan appreciates charan and tarak about natu natu song in rrr

‘దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడి,  ఫుల్‌ కెపాసిటీతో థియేటర్లు అందుబాటులో ఉంటే..  మార్చి 18న,   లేదంటే ఏప్రిల్‌ 28న  మా  సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అంటూ  చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌ లో క్లారిటీ ఇచ్చింది.  ఇక ఆర్ఆర్ఆర్..  అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో  కూడా  భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్  కాబట్టి  ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రాకపోవచ్చు. 

NTR
NTR

 ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో  నెటిజన్ల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.  ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు.  డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  కాగా  ‘బాహుబలి’ తర్వాత   రాజమౌళి  చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. 

RRR
RRR

పైగా  ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లూరి సీతారామరాజుగా  రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్, మరియు ట్రైలర్ అండ్ సాంగ్స్  విడుదలైయి  సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి.  దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతుంది ఈ ప్యాన్‌ ఇండియా మూవీ.   

 

  

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version