https://oktelugu.com/

క్లాస్ లు వింటూ కథ రాసిన స్టార్ హీరో !

సినీ వినీలాకాశంలో ‘దర్శకుడు’ అనే స్థాయి, పున్నమి నాడు నిండు చంద్రుడికి ఉండే స్థాయి లాంటది. అందుకే, సినిమాల్లోకి వచ్చే లైట్ బాయ్ దగ్గర నుండి కో డైరెక్టర్ వరకూ ప్రతి ఒక్కరి కల ఒక్కటే.. డైరెక్షన్ చేయడం. అందుకే.. సినిమా ఇండస్ట్రీలో ఒక కామన్ డైలాగ్ ఉంది, డైరెక్షన్ అంటే ఎందుకురా అంత పిచ్చి అని. ఈ డైలాగ్ ఇండస్ట్రీలో అందరికీ సెట్ అవుతుంది. ఏది ఏమైనా జీవితం నాశనం అయినా.. తన జీవిత లక్ష్యం […]

Written By: admin, Updated On : March 25, 2021 11:33 am
Follow us on


సినీ వినీలాకాశంలో ‘దర్శకుడు’ అనే స్థాయి, పున్నమి నాడు నిండు చంద్రుడికి ఉండే స్థాయి లాంటది. అందుకే, సినిమాల్లోకి వచ్చే లైట్ బాయ్ దగ్గర నుండి కో డైరెక్టర్ వరకూ ప్రతి ఒక్కరి కల ఒక్కటే.. డైరెక్షన్ చేయడం. అందుకే.. సినిమా ఇండస్ట్రీలో ఒక కామన్ డైలాగ్ ఉంది, డైరెక్షన్ అంటే ఎందుకురా అంత పిచ్చి అని. ఈ డైలాగ్ ఇండస్ట్రీలో అందరికీ సెట్ అవుతుంది. ఏది ఏమైనా జీవితం నాశనం అయినా.. తన జీవిత లక్ష్యం డైరెక్షనే అంటూ కృష్ణ నగర్, ఫిల్మ్ నగర్ చుట్టూ తిరుగుతున్న వేలమందితో పాటు ఇండస్ట్రీలో ఒక స్థాయి సంపాంధించి డైరెక్షన్ కోసం తమ కెరీర్ నే త్యాగం చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు.

కాగా మలయాళ సినిమా రంగంలో లెజెండరీ స్టేటస్ పొందిన హీరో మోహన్ లాల్ కూడా డైరెక్షన్ మాయలో పడ్డారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటించి విసిగిపోయారేమో గానీ, మొత్తానికి మోహన్ లాల్ కి కూడా ఇన్నేళ్ల తర్వాత, ఆయనకి డైరెక్టర్ కావాలనే కోరిక కలిగింది. ‘బారోజ్’ అనే పేరుతో తన తొలి డైరెక్టోరియల్ మూవీని ఆయన ఘనంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఎప్పుడో వాస్కోడిగామా కాలం నాటి కథ అట ఈ సినిమా కథ. పైగా మరో విశేషం ఏమిటంటే.. మోహన్ లాలే స్వయంగా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నారు.

ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాసుకునే క్రమంలో మోహన్ లాల్ ఆన్ లైన్ స్క్రీన్ ప్లే క్లాస్ లకు కూడా అటెండ్ అయ్యారట, ఒక సూపర్ స్టార్ ఇలా క్లాస్ లు విని మరీ సినిమా కథ, మరియు స్క్రిప్ట్ రాసుకోవడం అనేది ఒక్క మోహన్ లాల్ కి మాత్రమే సాధ్యం అయింది అనుకుంటా. ఇక మోహన్ లాల్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాలో ఒక కొత్త జంట లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇక ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయ్యారు. అలాగే ఆయన నటించిన మలయాళ చిత్రాలు ‘మన్యం పులి, లూసిఫర్’ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి.