Manchu Lakshmi Tested Positive: మంచు లక్ష్మీ ఎంజాయ్ మెంటే వేరు, కరోనా వచ్చి క్వారంటైన్ లో ఉన్నా.. ఆమె మాత్రం తన సరదాలను మాత్రం మానుకోవడం లేదు. ఆ మాటకొస్తే తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పడమే సింపుల్ గా సరదాగా చెప్పింది. ఇక ప్రస్తుతం మంచు లక్ష్మీ తన ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంది. అయితే, మంచు లక్ష్మి పై ప్లోర్ లో ఉంటే, కింది ఫ్లోర్‌లో ఆమె కూతురు విద్యా ఉందట.

ఇక ‘పై ఫ్లోర్’లో ఉంటోంది కాబట్టి మంచు లక్ష్మీ దూరం నుంచే తన కూతురిని, తన పెట్స్‌ను చూస్తూ కాలక్షేపం చేస్తోందట. అయితే, క్వారంటైన్ లోని ఎక్కువ సమయాన్ని కొత్త కొత్త సినిమాలను, మరియు వెబ్ సిరీస్ లను చూడటానికి కేటాయిస్తోందట. అందుకే, తనకు మంచి వెబ్ సిరీస్ లను, సినిమాలను సూచించండి అని గత వారం ఓ ట్వీట్ కూడా పెట్టింది.
కాగా తాజాగా మంచు లక్ష్మీ మిన్నల్ మురళీ అనే సినిమాను చూసింది. ఆ సినిమా ఆమెకు చాలా బాగా నచ్చిందని, సినిమా చూస్తున్న సమయంలో తెగ ఎగ్జైట్ అయ్యాయని మంచు లక్ష్మీ చెబుతుంది. పైగా మిన్నల్ మురళీ సినిమా మీద ప్రశంసలు కురిపిస్తూ వరుస ట్వీట్లు చేస్తూ.. మొత్తానికి మంచు లక్ష్మీ మిన్నల్ మురళీ సినిమాకి ఎంతో మేలు చేసింది.
Also Read: మహేష్ కోసం ఫ్యాన్స్ పూజలు, హోమాలు.. వైరల్..!
మొత్తానికి మంచు లక్ష్మీ తన క్వారంటైన్ సమయాన్ని అస్సలు వృథా చేయకుండా ఫుల్లుగా తనకే వాడేసుకోవాలని బాగా ఫిక్స్ అయినట్టు ఉంది. పైగా క్వారంటైన్ లోనూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఏది ఏమైనా హీరోల కుమార్తెలందు మంచు లక్ష్మి వేరయ్యా అని ఆమె మళ్ళీ మళ్ళీ నిరూపిస్తోంది. పైగా ఈ మధ్య మంచు లక్ష్మి అందాల ప్రదర్శన పై కూడా ఆసక్తి చూపిస్తోంది.
టాలీవుడ్ లో క్రమశిక్షణకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరొందిన మోహన్ బాబు కూతురిగా మంచు లక్ష్మీ తనదైన ముద్ర వేయాల్సింది పోయి, ఇలా బోల్డ్ గా పబ్లిక్ గా రెచ్చిపోవడం ఎంతవరకు భావ్యం ? అన్నట్టు మంచు లక్ష్మీ, ప్రస్తుతం నిర్మాతగా ఒక సినిమా నిర్మించడానికి కసరత్తులు చేస్తోంది.
Also Read: థమన్ కి కరోనా పాజిటివ్.. ఇండస్ట్రీని కబళిస్తున్న కరోనా !
During my #quarantinelife I came across this fantastic superhero movie Minnal Murali and I fell in love with it instantly. Here’s a big statement: After Spider-man this is my second favourite movie till date, yess! it’s that fabulous.
— Lakshmi Manchu (@LakshmiManchu) January 7, 2022