Kaathu Vaakula Rendu Kaadhal Samantha: సమంతలో ఇన్నాళ్లు గ్లామర్ మాత్రమే హైలైట్ అయింది. పైగా ఆమెది ఆకట్టుకునే అభినయం. ఇక స్టార్ హీరోయిన్ గా కేవలం తన టాలెంట్ తోనే ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో సైతం ఏకకాలంలో గొప్ప స్టార్ స్టేటస్ ను సాధించింది. అయితే, నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ తనలోని నటిని ఆరాధిస్తోంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్రల్లో కూడా నటిస్తూ తనదైన శైలిలో ముందుకు పోతుంది.

Also Read: క్వారంటైన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ !
అందులో భాగంగానే సామ్ ఓ నెగిటివ్ రోల్ కనిపించబోతుందని తెలుస్తోంది. ఆ సినిమా పేరు ‘కాత్తువాక్కుల రెండు కాదల్’. ఏమిటి ? ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా.. విజయ్ సేతుపతి, నయనతార జోడీగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇదే. ఇదొక టిపికల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. విజయ్ సేతుపతి, నయనతార లవ్ స్టోరీకి సామ్ విలన్ అట. సమంత ఈ సినిమా కోసం ఎక్కడా గ్యాప్ లేకుండా వరుసగా షూటింగ్ లో కూడా పాల్గొంది.
పైగా సామ్ ఈ సినిమాలో లేడీ విలన్ గా నటించింది. అందుకే, ఈ సినిమా సమంత కెరీర్ లోనే ప్రత్యేక సినిమాగా నిలిచిపోతుందట. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే సామ్ కూడా తన మిగిలిన సినిమాల విషయంలో ఎంతో సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటుంది. ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. హిట్ అయితే, సామ్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినట్టే.