మూవీ– మళ్లీ మొదలైంది
నటీనటులు– సుమంత్, నైనా గంగూలి, వర్షిణి సౌందరరాజన్, వెన్నెల కిషోర్, వర్షిణి సౌందరరాజన్
మ్యూజిక్– అనూప్ రూబెన్స్
డైరెక్షన్– టీజీ కీర్తి కుమార్
ప్రొడ్యూసర్– రాజశేఖర్ రెడ్డి
ఎడిటింగ్– ప్రదీప్
సినిమాటోగ్రఫీ– శివ
Malli Modalaindi Movie Review: పెండ్లి, విడాకులు అనే కాన్సెప్ట్ తో మన టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాను వివరించిన సినిమాలు మాత్రం కొన్నే. అలాంటి సినిమాలు హిట్ అయ్యాయి కూడా. కాగా పెండ్లి తర్వాత విడాకులు తీసుకుంటే జీవితంలో ఎలాంటి ఘటనలు ఎదురవుతాయి.. మళ్లీ పెండ్లి అంటే సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే సున్నితమైన అంశాన్ని తీసుకుని మళ్లీ మొదలైంది మూవీని తెరకెక్కించారు. సుమంత్, నైనా గంగూలి ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ కీర్తి కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఈరోజు ఓటీటీలో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ ఏంటంటే.. విక్రమ్(సుమంత్) వృత్తి రీత్యా ఒక చెఫ్. కాగా అతనికి తన ప్రయాణంలో నిషా(వర్షినీ సౌందర రాజన్)తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ పెండ్లి చేసుకుంటారు. అయితే కామన్ గానే ఇద్దరి మధ్య ఇగోలు, మనస్పర్థలు వచ్చి విడిపోతారు. కాగా విక్రమ్ విడాకుల కోసం పవిత్ర(నైనా గంగూలి) వద్దకు వెళ్తాడు. కాగా వీరిద్దరికీ ఆమె విడాకులు ఇప్పస్తుంది. అయితే అనుకోకుండానే పవిత్రను ప్రేమించడం మొదలు పెడతాడు విక్రమ్. ఈ విషయం తెలుసుకున్న పవిత్ర అతనికి దూరంగా ఉంటుంది. అయితే విక్రమ్ ఆమె ప్రేమను ఎలా పొందాడు, చివరకు ఆమె ఓకే చెప్పిందా అనేది సినిమా చూస్తేనే బాగుంటుంది.

ఎలా ఉందంటే.. ఇప్పుడున్న సమాజంలో విడాకులు తీసుకోవడం అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. కానీ విడాకులు తీసుకున్న తర్వాత తమ జీవితాలు ఎలా ఉంటాయి, సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే సున్నితమైన అంశాన్ని ఎంచుకున్న టీజీ కీర్తి కుమార్ మంచి సాహసమే చేశారు. అక్కడక్కడా కొన్ని వెయిట్ ఉన్న సీన్లను బాగానే హ్యాండిల్ చేశారు. కాకాపోతే ఇంకొంచెం డెప్త్ గా వెళ్లి ఉంటే బాగుండేది. ఇక విక్రమ్ పవిత్ర ప్రేమను పొందేందుకు చేసే ప్రయత్నాలు, సమాజంలో విడాకులు తీసుకున్న తర్వాత విక్రమ్‌కు, నిషాకు ఎదురయ్యే సంఘటనలతో మొదటి పార్ట్ పూర్తి అవుతుంది.
ఇక రెండో పార్ట్ లో విక్రమ్ ప్రేమను పవిత్ర అంగీకరించి చివరకు పెండ్లి చేసుకుందామంటూ అడుగుతుంది. అయితే ఇంతలోనే విక్రమ్ పెండ్లి అనగానే సందిగ్ధంలో పడిపోతాడు. ఇప్పటికే ఓసారి పెండ్లి చేసుకుని విడిపోయానని, కాబట్టి పవిత్రతో కూడా పెండ్లి అయ్యాక గొడవలు జరుగుతాయేమో అని భయపడి వెనకడుగు వేస్తాడు.
Also Read: ‘ఎఫ్ఐఆర్’ మూవీ రివ్యూ..
ఈ సమయంలోనే లాయర్ కుటుంబరావు(పోసాని కృష్ణ మురళి) అతనికి మంచి సలహాలు ఇస్తాడు. విడిపోయిన వారికి రెండో పెండ్లి అవసరాన్ని చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేస్తాడు. అంతే కాకుండా మరోసారి విడిపోకుండా.. ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో సర్ధుకుని పోతే చాలు అన్నట్టు చెప్తాడు. ఇదే చివరగా సినిమాకు ఎండింగ్ అనిపిస్తుంది. కాగా మధ్య మధ్యలో విక్రమ్ స్నేహితుడుగా చేసిన వెన్నెల కిషోర్ కామెడీ పర్వాలేదని పిస్తుంది.
ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో సుమంత్ విక్రమ్ పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. కొన్ని సందర్భాల్లో ప్రతి మనిషి పడే టెన్షన్‌ను చాలా చక్కగా నటించి చూపించాడు సుమంత్. ఇకపోతే నైనా గంగూలి తన పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది. ఎప్పుడూ బుల్లితెరపై అమాయకత్వాన్ని ప్రదర్శంచే.. వర్షిణి ఈ పాత్రతో నటిగా మంచి మార్కులే వేసుకుంది. అయితే ఇలాంటి కథను ఎంచుకున్నప్పుడు దానికి తగ్గట్టు కొన్ని బలమైన సీన్లు ఉంటే బాగుండేది. అయినా కూడా దర్శకుడు బాగానే తీర్చిదిద్దారు. అక్కడక్కడా కొంచెం బోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా ఒకసారి ఈ మూవీని చూడొచ్చు.
Also Read: కాజల్ ట్రోల్స్ పై స్పందించిన సమంత, మంచు లక్ష్మీ !
ప్లస్ లు..
కథ, సుమంత్ యాక్టింగ్, డైలాగులు
మైనస్‌లు..
స్లో నరేషన్, బోర్ కొట్టించే కొన్ని సీన్లు..
చివరిగా.. ఈ మూవీని ఎవరైనా ఒకసారి చూడొచ్చు.. ఫీల్ గుడ్ మూవీ