ఆచార్య చిత్రంలో మహేష్ బాబు లేనట్టే..

మెగా స్టార్ చిరంజీవి చిత్రం అంటేనే ప్రేక్షకుల్లోఅత్యంత ఆసక్తి ఉంటుంది. అటువంటి అపుడు ఆ చిత్రం లో మరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నటించ బోతున్నాడు అన్న సంచలన వార్త బయటికి వచ్చింది. దాంతో మెగా అభిమానులు, సూపర్ స్టార్ అభిమానులు ఉప్పొంగి పోయారు. ఎంతో ఆత్రుత తో అందరూ షూటింగ్ అప్ డేట్స్ గురించి వెయిట్ చేశారు ఎన్నో మలుపులు తిరిగిన ఈ వార్తొదంతం చివరకి మళ్ళీ మొదటికి వచ్చింది. కొరటాల శివ […]

Written By: admin, Updated On : March 16, 2020 6:09 pm
Follow us on

మెగా స్టార్ చిరంజీవి చిత్రం అంటేనే ప్రేక్షకుల్లోఅత్యంత ఆసక్తి ఉంటుంది. అటువంటి అపుడు ఆ చిత్రం లో మరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నటించ బోతున్నాడు అన్న సంచలన వార్త బయటికి వచ్చింది. దాంతో మెగా అభిమానులు, సూపర్ స్టార్ అభిమానులు ఉప్పొంగి పోయారు. ఎంతో ఆత్రుత తో అందరూ షూటింగ్ అప్ డేట్స్ గురించి వెయిట్ చేశారు ఎన్నో మలుపులు తిరిగిన ఈ వార్తొదంతం చివరకి మళ్ళీ మొదటికి వచ్చింది.

కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో 152 వ చిత్రం గా తీస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్ర కోసం మొదట రామ్ చరణ్ నే అనుకొన్నారు. కానీ త్రిబుల్ ఆర్ షూటింగ్ లో ఉన్న చెర్రీ బయటికి వచ్చి సినిమా చేసే ఛాన్స్ లేకపోవడం తో ఆ ప్రపోజల్ విరమించు కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మహేష్ బాబు పేరు తెర మీదకు వచ్చింది. 30 రోజుల పాటు ఆచార్య చిత్రం కోసం మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు అన్న వార్త వైరల్ అయ్యింది. ఈ వార్త సినిమాపై అంచనాలను పీక్స్ కు తీసుకు వెళ్ళింది.. అయితే తాజాగా అందుతున్నవార్తలను బట్టి ” ఆచార్య” చిత్రం లో మహేష్ బాబు నటించడం లేదు. .

ఈ విషయంలోపలు కధనాలు బయటికి వచ్చాయి. ఆచార్య చిత్రం లో నటించేందుకు మహేష్ బాబు 30 రోజులకు ఏకంగా 30 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడంటూ వార్తలు వచ్చాయి. 30 కోట్ల పారితోషికం ఆయనకు ఇస్తే సినిమా బడ్జెట్ పరిమితి మించుతుందనే ఆలోచనతో సినీ యూనిట్ మరో ఆలోచనలో పడింది. చిరంజీవి తో రామ్ చరణ్ నటించినా కూడా సినిమాకు ఖచ్చితంగా భారీ బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం అన్న కారణంగా మహేష్ బాబు లేకున్నా పర్వా లేదని యూనిట్ సభ్యులు ఫిక్స్ అయ్యారు. ఇక పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే మే 5 వ తారీకు నుంచి రామ్ చరణ్ ఆచార్య చిత్రం షూటింగ్ లో పాల్గొనేలా ప్లాన్ చేశారు. prevention is better than cure
.