Homeఎంటర్టైన్మెంట్హిట్ సినిమాకు షాక్ ఇచ్చిన కరోనా

హిట్ సినిమాకు షాక్ ఇచ్చిన కరోనా

“మధ.”. గత శుక్రవారం పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమా. శ్రీ విద్య బసవ అనే లేడీ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించింది. త్రిష్న అనే కొత్తమ్మాయి ఈ సినిమాలో హీరోయిన్ గా లీడ్ రోల్ చేసింది. ఇక నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కొత్త వాళ్లే. కానీ అందరూ కలిసి ఓ మంచి ప్రయత్నం అయితే చేశారు. ఆ క్రమం లో సినిమా చూసిన జనాల నుంచి మంచి స్పందనే వచ్చింది. విడుదలకు ముందే ఈ చిత్రం 26 చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అనేక అవార్డులు గెలుచుకొంది.

కాకపోతే ఈ చిత్రానికి నిర్మాత కూడా అయిన దర్శకురాలు శ్రీవిద్య బసవ ఈ సినిమాను సరిగా ప్రమోట్ చేయడంలో, మంచి డేట్ చూసి విడుదల చేయడంలో మాత్రం విఫలమైంది. పెద్దగా పబ్లిసిటీ చేయకుండానే అన్ సీజన్లో సడన్ గా ” మధ ” సినిమా ని రిలీజ్ చేశారు.

అయినప్పటికీ చూసిన వాళ్లందరూ తెలుగులో వచ్చిన చక్కటి ప్రయోగాత్మక చిత్రాల్లో ఈ “మధ ” చిత్రం ఒకటని పొగుడు తున్నారు అంతేగాకుండా లిమిటెడ్ బడ్జట్ లో కంటెంట్‌ను నమ్ముకుని సినిమాను తెరకెక్కించిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, హీరో నవదీప్ , మంచు లక్ష్మి వంటి సినీ సెలబ్రిటీ లు ఈ సినిమాని చూసి దర్శకురాల్ని మెచ్చుకొన్నారు. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ , హీరోయిన్ పెర్ఫామెన్స్, సాంకేతిక నైపుణ్యం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ థియేటర్లు మూతబడి పోతుండటం తో సినిమా దెబ్బతినే పరిస్థితి వచ్చింది.

కరోనా వైరస్ ధాటికి తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు థియేటర్లను మూసి వేశారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా థియేటర్లు మూతబడటం లాంఛనమే ..ఒకవేళ మూతబడక పోయినా జనాలు థియేటర్ లకు రావడం బాగా తగ్గించారు. దీంతో రిలీజైన మూడు రోజులకే ” మధ ” సినిమా థియేట్రికల్ రన్ ముగిసి పోయినట్టు అయింది..ఇక ” మధ ” చిత్రం పుంజుకోవడం అంటే చాలా చాలా కష్టం. time and tide wait for none

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version