తమ్మినేని, రాజకీయ నాయకుడా..?స్పీకరా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2020 స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తమ్మినేని స్పందించారు. రమేష్ కుమార్ పై జనం కోపంతో ఉన్నారని ఆయన కనిపిస్తే జనం కొట్టేలా ఉన్నారని తమ్మినేని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఒక రాజకీయ నాయకుని వలె టీడీపీ నేతలపై తమ్మినేని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వంటి నీచాతినీచ రాజకీయనాయకులున్నంత వరకూ […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 1:31 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2020 స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తమ్మినేని స్పందించారు. రమేష్ కుమార్ పై జనం కోపంతో ఉన్నారని ఆయన కనిపిస్తే జనం కొట్టేలా ఉన్నారని తమ్మినేని వ్యాఖ్యానించారు.

అంతే కాకుండా ఒక రాజకీయ నాయకుని వలె టీడీపీ నేతలపై తమ్మినేని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వంటి నీచాతినీచ రాజకీయనాయకులున్నంత వరకూ వ్యవస్థలకు పట్టిన భ్రష్టు వదలదని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్నసంగతి మరిచిపోయి 2019 ఎన్నికల్లో ప్రజలు మాకు అండగా నిలిచారని, ఎన్నికలకు ముందు జగన్ ఏడాది ముందు నుంచి పాదయాత్ర చేపట్టారని అన్నారు. ఐదు సంవత్సరాలు ఆగకపోతే పాదయాత్ర చేసుకో బాబు అంటూ చంద్రబాబుకు సలహా ఇచ్చారు. ఎన్నికల కమీషన్ ను మేం గౌరవిస్తామన్న ఆయన ఎన్నికల కమీషనర్ తీసుకున్న నిర్ణయాన్ని కాదని అన్నారు. రమేష్ కుమార్ “ఏం తమాషాగా ఉందా..?” ఎన్నికల కమీషనర్ గా ఎందుకు.. సీఎం కూర్చీలో కూర్చోమనండి” అంటూ వ్యాఖ్యానించారు. కరోనా కోసం ఇప్పటికే 20 లక్షల ఇళ్లను సర్వే చేయించామని, ఎన్నికలు జరిపేందుకు ప్రతిపక్షాలు ఎక్కడ అవకాశాన్ని ఇచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు పిచ్చనాకొడుకులు అంటూ అతి సాధారణ వైసీపీ కార్యకర్త వేలే విమర్శించారు తమ్మినేని.

ఒక రాష్ట్రానికి స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని, రాజ్యాంగ బద్దమైన వ్యవస్థలో ఉన్న మరో వ్యక్తి పై ఈ స్థాయిలో విమర్శలు చేయడాన్ని అనేకమంది తప్పుపడుతున్నారు. ఒక సాధారణ రాజకీయ నాయకుడి వలే తమ్మినేని ప్రవర్తించాడు. కమ్మ వైరస్, టీడీపీ నాయకులు పిచ్చనాకొడుకులు, చంద్రబాబు ఒక చీడ పురుగు అని అతి దారుణమైన పరుష పదాలను వాడడంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది. రాజకీయ నాయకుడుగా కొనసాగాలని ఉంటె అలానే ఉండాల్సింది, కానీ మంచి గౌరవప్రధమైన స్థానంలో ఉండి అతి తక్కువ స్థాయికి దిగజారి రాజకీయాల నాయకులను విమర్శించం ఏమిటని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.