ప్చ్.. లెజెండరీ రైటర్ కి చుక్కలు చూపిస్తోంది !

తమిళ సినీ సాహిత్యంలోనే గొప్ప రచయితగా వైరముత్తుది ప్రత్యేక స్థానం. ఆయన రాయని ఎక్స్ ప్రెషన్ లేదు, తన పదాలతో ఆయన పలికించని భావం లేదు. అంత గొప్ప రచయిత అయినప్పటికీ ఆయనలో కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. లెజెండరీ స్టేటస్ పొందిన ఓ కవి, అమ్మాయిల విషయంలో ముఖ్యంగా సింగర్స్ విషయంలో పరిధి దాటి ప్రవర్తించడం.. ఆయన అఖండ సినీ రచనా ప్రయాణానికే అవమానం. ఆ అవమానం కారణంగానే ఆయన పై ఎన్నో విమర్శలు, మరెన్నో […]

Written By: admin, Updated On : May 31, 2021 10:47 am
Follow us on

తమిళ సినీ సాహిత్యంలోనే గొప్ప రచయితగా వైరముత్తుది ప్రత్యేక స్థానం. ఆయన రాయని ఎక్స్ ప్రెషన్ లేదు, తన పదాలతో ఆయన పలికించని భావం లేదు. అంత గొప్ప రచయిత అయినప్పటికీ ఆయనలో కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. లెజెండరీ స్టేటస్ పొందిన ఓ కవి, అమ్మాయిల విషయంలో ముఖ్యంగా సింగర్స్ విషయంలో పరిధి దాటి ప్రవర్తించడం.. ఆయన అఖండ సినీ రచనా ప్రయాణానికే అవమానం. ఆ అవమానం కారణంగానే ఆయన పై ఎన్నో విమర్శలు, మరెన్నో అనుమానాలు.

ఏది ఏమైనా వైరముత్తు వ్యక్తిత్వంపై చాలా మరకలున్న మాట వాస్తవం. నిజానికి ఆయన పై ఎన్నో ఏళ్లుగా అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ..ఇన్నేళ్లు ఆయన వైపు వేలెత్తి చూపించడానికి కూడా భయపడేవాళ్లు. కానీ ఎప్పుడైతే తనని లైంగికంగా వేధించారని ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి, ఆయన పై ఆరోపణలు చేయడం, పైగా ఆరోపణలతో సరిపెట్టకుండా ఆయనకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేయడంతో ఆయన బాధితులు ఒక్కొక్కరు బయటపడుతూ వచ్చారు.

పైగా వైరముత్తు బాధితులు ఇంకా ఎంతోమంది ఉన్నారంటూ మరికొందరి వర్ధమాన సింగర్స్ చాట్స్ ని కూడా తన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది చిన్మయి. ఆ చాట్స్ చూసిన కొంతమంది తమిళ దర్శకులు కూడా వైరముత్తుకి దూరం జరిగారు. తమ సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వడం మానేశారు. వైరముత్తుకి వ్యతిరేకంగా పోరాటం చేసిన చిన్మయి తాజాగా ఆయనికి వచ్చే అవార్డును కూడా రాకుండా చేసింది.

తమిళ సినీ ఇండస్ట్రీలో ఓఎన్‌వీ కురుప్‌ అవార్డు అంటే ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది. ఈ అవార్డును వైరముత్తుకి ప్రకటించింది జ్యురీ. ఐతే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ కామాంధుడికి, ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిత్వం లేని ఓ వ్యక్తికి ఇంత గొప్ప ప్రతిష్టాత్మక అవార్డును ఎలా ఇస్తారు ? అంటూ సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెట్టి మరి రచ్చ చేస్తూ వచ్చింది చిన్మయి. దాంతో స్వయంగా వైరముత్తు ఆ అవార్డును నాకు ఇవ్వకండి అంటూ జ్యురీకి విన్నవించుకున్నాడు. పాపం గొప్ప రచయితకి చుక్కలు చూపిస్తోంది చిన్మయి.