Jabardast Show: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న మూస సీరియళ్ళ ట్రెండ్ ను జబర్దస్త్ షో మార్చివేసింది. కామెడీ, వినోద తరహా షోలకు ప్రజలు ఎలా బ్రహ్మరథం పడుతుందో జబర్దస్త్ షోకు వచ్చే టీఆర్పీ చూస్తే అర్థమవుతోంది.

ఈ కామెడీ షో ద్వారా అనేక మంది కామెడీయన్లు వెలుగులోకి వచ్చారు. ఈ షోలో చేసిన అనేక మంది కామెడీయన్లు ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కామెడియన్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సుధీర్, షకలక శంకర్ లాంటి వాళ్లు హీరోలు మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అయితే ఈ షోలో చేసిన కామెడియన్స్ అంతా కూడా ఇటీవల కాలంలో ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు. ఈ ప్రభావం జబర్దస్త్ షోపై స్పష్టంగా కన్పిస్తోంది. దీనికి తోడు ఇతర ఛానళ్లు ఈ తరహా కామెడీ షోలను ప్రసారం చేస్తుండటంతో జబర్దస్త్ షోకు క్రమంగా టీఆర్పీ పడిపోతుంది. తాజాగా జబర్దస్త్ షోలో గత కొంతకాలంగా కనిపించకుండా పోయిన కమెడియన్ అప్పారావు తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లారు.
జబర్దస్త్ షో గురించి పలు ఆసక్తికరమైన, సంచలన వ్యాఖ్యలను చేశారు. జబర్దస్త్ షో తనకు లైఫ్ ఇచ్చిందని అప్పారావు తెలిపారు. అయితే కొంతకాలంగా తనను హోల్డ్ పెట్టారని ఇది తనను ఎంతోగానో బాధకు గురిచేసిందని వాపోయారు. తాను బిగ్ బాస్ లోకి, సినిమాల్లోకి వెళుతున్నానని పుకార్లు పుట్టించి షోకు దూరంగా పెట్టారన్నారు.
జబర్దస్త్ లో మోసేవాళ్లు, కూసేవాళ్లు, తోసేవాళ్లు చాలా మంది ఉన్నారంటూ అప్పారావు సెటైర్ వేశారు. చెప్పుడు మాటలతో తనను హోల్డ్ లో పెట్టారన్నారు. తన ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే తాను ఒక్క రోజు కూడా షూటింగులకు, ప్రాక్టీసులకు డుమ్మా కొట్టిన దాఖలాలు లేవన్నారు. అలాంటిది తనను కావాలనే హోల్డ్ పెట్టాడంతో షో నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.
జబర్దస్త్ షో తనకు మొదటి షో కాదని చెప్పారు. దీని కంటే ముందు ఐదు షోలు చేశానని, జబర్దస్త్ తో మంచి పేరొచ్చిందని తెలిపాడు. తనను జబర్దస్త్ కు పరిచయం చేసింది మాత్రం షకలక శంకరేనని గుర్తు చేసుకున్నాడు. ఈ షోలో చేశాక దాదాపు 150 సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కిందన్నారు.
యంగ్ డైరెక్టర్స్ వల్లే జబర్దస్త్ మంచి హిట్ సాధించిందని తెలిపారు. ప్రస్తుతం మరో షోలో చేస్తున్నానని అక్కడ జబర్దస్త్ కంటే డబుల్ పేమెంట్ వస్తుందని అప్పారావు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను చేస్తున్న షోకు మంచి టీఆర్పీ వస్తుందని తెలిపారు. ఇప్పుడు జబర్దస్త్ కంటే మంచి పొజిషన్లో ఉన్నానంటూ అప్పారావు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
[…] Also Read: జబర్దస్త్ షోపై ప్రముఖ కమెడియన్ సెటైర… […]
[…] Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ప్రముఖ నటి, మోడల్ షగున్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కొత్త షో ‘హర్ పల్ మోహినీ’ ఇంటర్వ్యూలో పొల్గొన్న ఆమె తన బోల్డ్ రోల్‌పై తన తన తల్లిదండ్రుల స్పందన గురించి తెలిపింది. ఓ వెబ్ సిరీస్‌లో భాగంగా నటుడితో బెడ్‌పై రొమాన్స్ సీన్‌లో నటించాల్సి ఉంటుందని తల్లిదండ్రులతో చెప్పానంది. నీ భవిష్యత్తు కోసం ఇలాంటి చిన్న చిన్న సాహసాలను చేయాలని ఆమె తల్లిదండ్రులు తెలిపారంది. […]