Homeసినిమా వార్తలుక్రేజీ బ్యూటీకి ఛాన్స్ లు... వారి వల్లే !

క్రేజీ బ్యూటీకి ఛాన్స్ లు… వారి వల్లే !

‘కేతిక శర్మ’ మోడలింగ్ చేసే సయమంలోనే ఆమె స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకునేవారు. కానీ, బ్యాడ్ టైమ్.. అమ్మడికి అందం ఎంత ఉన్నా, సినిమా అవకాశాలు అంత తేలిగ్గా ఏమి రాలేదు. ఎన్నో కష్టాలు అవమానాల తరువాత తొలి సినిమాగా ‘రొమాంటిక్’ అనే సినిమా వచ్చింది. సినిమాని ఎంతో కష్టపడి పూర్తి చేసింది. రిలీజ్ కోసం ఎదురుచూస్తోన్న సమయంలో కరోనా ఎటాక్ చేసింది. మళ్ళీ కేతిక శర్మకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. చిన్నాచితకా చిత్రాలు వచ్చాయి. […]

Ketika Sharma
‘కేతిక శర్మ’ మోడలింగ్ చేసే సయమంలోనే ఆమె స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకునేవారు. కానీ, బ్యాడ్ టైమ్.. అమ్మడికి అందం ఎంత ఉన్నా, సినిమా అవకాశాలు అంత తేలిగ్గా ఏమి రాలేదు. ఎన్నో కష్టాలు అవమానాల తరువాత తొలి సినిమాగా ‘రొమాంటిక్’ అనే సినిమా వచ్చింది. సినిమాని ఎంతో కష్టపడి పూర్తి చేసింది. రిలీజ్ కోసం ఎదురుచూస్తోన్న సమయంలో కరోనా ఎటాక్ చేసింది.

మళ్ళీ కేతిక శర్మకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. చిన్నాచితకా చిత్రాలు వచ్చాయి. డబ్బులు కోసం తప్పక రెండు సినిమాలను ఒప్పుకుంది. అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తరువాత కేతిక శర్మ గురించి అందరూ మర్చిపోయారు. దానికితోడు రొమాంటిక్ సినిమా పై కూడా ఎలాంటి అంచనాలు లేవు. కానీ అంతలో కేతిక శర్మకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. తొలి సినిమా విడుదల కాకపోయినా,

అమ్మడికి టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. మేకర్స్ అందరి దృష్టిని ఆకర్షించేసింది ఈ యంగ్ బ్యూటీ. ఎంతైనా ఈ బ్యూటీ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ ప్రోడక్ట్ కదా. పూరినే ఆమెను మొదట హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. అయితే ఉన్నట్టు ఉండి కేతిక శర్మ, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టికి పోటీ ఇచ్చే స్థాయిలో ఛాన్స్ లను ఎలా పట్టుకుంటుంది అంటే.. దీని వెనుక పూరి అండ్ ఛార్మి ఉన్నట్లు తెలుస్తోంది.

కేతిక శర్మకు భారీ ఆఫర్లు వచ్చేలా ఛార్మి తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ ముందుకుపోతుందట. ఎలాగూ హీరోయిన్లను స్క్రీన్ మీదకు ప్రెజెంటేషన్ చేయడంలో పూరి మాస్టర్ డిగ్రీ చేశాడు. అసలే సరైన హీరోయిన్ల కోసం కిందామీదా పడుతోన్న టాలీవుడ్ మేకర్స్ దృష్టిని మొత్తానికి కేతిక శర్మ బాగానే ఆకర్షిస్తోంది. ఆమె చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper