
కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఉంటే ప్రస్తుతం విదేశాల నుంచి భారత్ సాయం పొందే అవసరం వచ్చేది కాదన్నారు. విదేశాల నుంచి సాయం పొందుతూ కూడా కేంద్రం తన చర్యలను సమర్థించుకోవడం బాధాకరమని రాహుల్ ట్వీట్ చేశారు. విదేశాల సాయం తీసుకోవడాన్ని భారత ప్రభుత్వం పదేపదే గొప్పగా చెప్పుకోవడం బాధాకరం ప్రభుత్వం తన బాధ్యతను సరిగా నిర్వర్తించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు అని పేర్కొన్నారు.