
ప్రతిష్టాత్మక మాడ్రిడ్ పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్ రెండో సారి టైటిల్ గెల్చుకున్నాడు. మొదటి సెట్ కోల్పోయినప్పటికి వరుసగా రెండు సెట్లలో ప్రపంచ నంబర్ 9 బరాటినిని ఓడించి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ప్రపంచ నంబర్ 6 జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ మాటియో బరాటినిని ఓడించి మాడ్రిడ్ ఓపెన్ 2021 ను గెలుచుకున్నాడు. ఫైనాల్లో జ్వెరెవ్ 6-7(8), 6-4, 6-3 తేడాతో బరాటిపై విజయం సాధించాడు.