సంగీత దర్శకుడు కీరవాణికి అప్పుడప్పుడే పేరు ప్రఖ్యాతలు వస్తోన్న రోజులు అవి. ఆయన పాటలు జనంలోకి బాగా వెళ్తున్న రోజుల అవి. అయితే, ఆయనతో పాటు నటుడు కోట శ్రీనివాసరావు కూడా బాగా ఎదుగుతున్నారు. అయితే, విచిత్రంగా కీరవాణికి కోట అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. అందుకే మీకు నచ్చిన నటుడెవరు? అని అడగగానే,
ఆయన నాకు వాయిద్యాల్లో వేణువు ఎంతిష్టమో, నటీనటుల్లో కోట శ్రీనివాసరావు అంటే అంతిష్టం’ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడట. ఇలాగే అన్నమయ్య సినిమా షూటింగ్ సమయంలో కూడా కోట శ్రీనివాసరావు పై ప్రశంసలు కురిపించాడు కీరవాణి. ఎవరో కోట శ్రేయోభిలాషులు ఆ విష’యం తీసుకువెళ్లి కోట శ్రీనివాసరావుకు చెబితే.. ఊరుకోవయ్యా ఆట పట్టించింది చాలుగానీ.
కీరవాణిగారు నన్ను అభిమానించడానికి నేను ఏమైనా హీరోనా ఏమిటి ? గొప్ప అందగాణ్ణి ఏమి కాదు, పైగా కమర్షియల్ సక్సెస్ లు అందుకున్న వాడిని కూడా ఏమి కాను. హీరోని కాదు, మరొకటి కాదు, ఇక నన్ను ఎందుకు అభిమానిస్తారు ?’ అంటూ కొట్టిపారేశారు. కానీ ఆ మధ్య ఓ సినిమా ప్రివ్యూకు వెళ్లిన సమయంలో ఆ సినిమాలో కోట వేషం చూసి, ‘ఏం నటుడయ్యా ఆయన ? ఎంతిచ్చినా ఆయనకు తక్కువే’ అని కీరవాణి ఆనందంతో అన్నారట.
ఆ మాట అన్న సమయంలో కీరవాణి వెనుక సీట్ లో కోట శ్రీనివాసరావు ఉన్నారు. ఇంటర్వెల్ లో కోట వచ్చి కీరవాణిని కలిసారు. ‘నేను మీకు అభిమానిని సర్. మీకు ఏమివ్వగలరు వీళ్ళు ? మీలాంటి నటుడిని డబ్బుతో కొనగలరా? మీరు తెలుగు వాడవడం మా అదృష్టం’’ అని కీరవాణి గారు ఎమోషనల్ గా చెప్పినప్పుడు గానీ, కోట నమ్మలేదు, కీరవాణికి తనంటే ఇష్టమని.