https://oktelugu.com/

కేంద్రానికి వంత పాడుతున్న జగన్?

జగన్ ఎవరికీ భయపడడు. దేనికీ బెదరడు అనే పేరుంది. అప్పట్లో సోనియాగాంధీని సైతం ఎదిరించారు. 16 నెలలు జైలు జీవితాన్ని గడిపినా కసి ఉన్న ముఖ్యమంత్రి అయ్యరు. అంతటి ధైర్యసాహసాలు ప్రదర్శించిన జగన్ కొద్ది రోజులుగా కేంద్రానికి సాగిలపడుతున్నారు. ప్రతి పనికి కేంద్రం వైపు చూస్తున్నారు. ప్రధాని మాటే వేదంగా భావిస్తున్నారు. సీఎం అయిన తరువాత జగన్ లో భిన్న ధోరణులు కనిపిస్తున్నాయి. రెండేళ్లుగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. రాష్ర్ట ప్రయోజనాల కోసం జగన్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 26, 2021 / 03:53 PM IST
    Follow us on


    జగన్ ఎవరికీ భయపడడు. దేనికీ బెదరడు అనే పేరుంది. అప్పట్లో సోనియాగాంధీని సైతం ఎదిరించారు. 16 నెలలు జైలు జీవితాన్ని గడిపినా కసి ఉన్న ముఖ్యమంత్రి అయ్యరు. అంతటి ధైర్యసాహసాలు ప్రదర్శించిన జగన్ కొద్ది రోజులుగా కేంద్రానికి సాగిలపడుతున్నారు. ప్రతి పనికి కేంద్రం వైపు చూస్తున్నారు. ప్రధాని మాటే వేదంగా భావిస్తున్నారు. సీఎం అయిన తరువాత జగన్ లో భిన్న ధోరణులు కనిపిస్తున్నాయి.

    రెండేళ్లుగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. రాష్ర్ట ప్రయోజనాల కోసం జగన్ పెదవి విప్పడం లేదని చెబుతున్నా అసలు విషయం వేరే ఉందని అంటున్నారు నాయకులు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విషయంలో కూడా ప్రధాని మోదీతో కయ్యానికి కాలు దువ్వడం లేదు. మోదీ ఎంత చెబితే అంతేలా ప్రవర్తిస్తున్నారు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో కష్టాలు తెచ్చేలా ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు.

    జగన్ కు ధైర్యసాహసాలు ఎక్కువే. కానీ గత కొన్ని రోజులుగా ఆయన ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. జగన్ కు సైతం లొంగిపోయే మనస్తత్వం ఉందని తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రాష్ర్ట ప్రభుత్వ సాయం అవసరమే. కానీ పూర్తిగా లొంగిపోవడం సరైంది కాదని అంటున్నారు. పక్క రాష్ర్టాల ముఖ్యమంత్రులను చూసైనా అప్పుడప్పుడు విమర్శలు చేయడం కూడా లేదని వాపోతున్నారు.

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే దాని ప్రభావం జగన్ పై కూడా పడుతుంది. సీఎం సైతం కష్టాల్లో పడిపోతారు. రాష్ర్టవ్యాప్తంగా ఇబ్బందులు పడక తప్పదు. సున్నితమైన అంశాల్లో కూడా జగన్ లో స్పందన లేకపోవడాన్ని అనేకమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదు రాష్ర్టాల ఫలితాలు చూసైనా జగన్ లో మార్పు రాకపోవడం మంచిది కాదని సొంత పార్టీ నేతలే పేర్కొంటున్నారు.