
చందమామ ‘కాజల్ అగర్వాల్’ పెళ్లి తరువాత కూడా భర్తను దూరం పెట్టి మరీ వరుస సినిమాలు ఒప్పుకుంటూ ముందుకుపోతుంది. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ పై కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘ప్రస్తుతం నేను వరుసగా సినిమాలు చేస్తున్నాను. అయితే, ఒకవేళ నా భర్త గౌతమ్ కిచ్లూ నన్ను ఇక యాక్టింగ్ వదిలేయమని చెప్తే నేను సినీ రంగాన్ని వదిలేస్తానని చెప్పుకొచ్చింది.
అయితే, నాకు నా భర్త, అలాగే నా కుటుంబం నుంచి నాకు కావాల్సినంత మద్దతు ఉంది, అందువల్లనే పెళ్లి తరువాత కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాను. ఇప్పటికీ నటన మీద ఎక్కువ దృష్టి పెట్టగలుగుతున్నాను, దానికి కారణం నా ఫ్యామిలీనే’ అని కాజల్ చెప్పింది. అయినా పెళ్లి అయి సంవత్సరం కూడా కాకుండానే ఎందుకు ఇంత బిజీ అవుతున్నావ్ అని కాజల్ ను హీరోలు కూడా అడుగుతున్నారట.
కానీ కాజల్ కి ఏమో సినిమాలు, రెమ్యునరేషన్స్ అంటే ప్రాణం. పైగా తన భర్త గౌతమ్ తో ఎప్పటినుండో డేటింగ్ లో ఉంది. ఇక కొత్తగా సంసారం అనే కాన్సెప్ట్ లో ఆమెకు పెద్దగా కిక్ ఇవ్వలేదు. అలాగే మొదటి నుండి కుటుంబం కోసం కాజల్ ఖాళీగా ఇంటికే పరిమితం అవ్వడం అసలు ఇష్టం లేదు. అందుకే వరుస సినిమాలు ఒప్పుకుంటే.. కొత్త అవకాశాల కోసం తానే ఫోన్లు చేసి మరీ ఛాన్స్ లను అడుగుతుంది.
ఇక ఈ ముదురు చందమామ ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్యతో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, అలాగే ఒక తమిళ సినిమా మరియు ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. ఇక కొత్తగా ఒప్పుకున్న సినిమాల విషయానికి వస్తే.. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రానున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అదేవిధంగా..
తమిళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ‘ఘోస్టీ’, మరియు డీకే దర్శకత్వంలో ఓ సినిమా, మలయాళంలో దుల్కర్ సల్మాన్ ‘హే సినామిక’ సినిమాల్లో కూడా హీరోయిన్న గా నటిస్తూ రానున్న రెండు సంవత్సరాలు కూడా ఫుల్ బిజీగా షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంది కాజల్.