https://oktelugu.com/

‘లవ్ స్టోరీ’ ట్రైలర్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

నాగచైతన్య హీరోగా చేస్తోన్న సినిమా ‘లవ్ స్టోరీ’ పై మొత్తానికి అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ పరంగా భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 16న విడుదలకు రెడీ అవుతుంది. అయితే నెలకు ముందే ప్రమోషన్స్ ను మొదలెట్టిన ఈ చిత్ర యూనిట్, ప్రమోషన్స్ లో ఇంకా వేగం పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను కట్ చేసి పెట్టారట. ట్రైలర్ లో చైతు – సాయి పల్లవిల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 4, 2021 / 06:48 PM IST
    Follow us on


    నాగచైతన్య హీరోగా చేస్తోన్న సినిమా ‘లవ్ స్టోరీ’ పై మొత్తానికి అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ పరంగా భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 16న విడుదలకు రెడీ అవుతుంది. అయితే నెలకు ముందే ప్రమోషన్స్ ను మొదలెట్టిన ఈ చిత్ర యూనిట్, ప్రమోషన్స్ లో ఇంకా వేగం పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను కట్ చేసి పెట్టారట. ట్రైలర్ లో చైతు – సాయి పల్లవిల పెర్ఫామెన్స్ అవుట్ స్టాండింగ్ గా ఉందని అంటున్నారు ట్రైలర్ చూసిన సినీ జనాలు .

    మరి మేకర్స్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 10న ఈ సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపి.. ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కుల వ్యవస్థకి సంబంధించి సున్నితమైన సమస్యను డీల్ చేశారని.. అలాగే జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేసే ఒక మిడిల్ క్లాస్ జీవితాలను చాలా అందంగా చూపించారని.. సినిమాలో ఎమోషన్స్ చాల ఎఫెక్టివ్ గా ఉంటాయని తెలుస్తోంది.

    మొత్తానికి శేఖర్ కమ్ముల నుండి మరో ఎమోషనల్ డ్రామా రాబోతుంది అన్నమాట. ఇద్దరు స్వచ్ఛమైన ప్రేమికులకు తమ ప్రేమను త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే.. ఆ పరిస్థితుల నుండి వాళ్ళు బయటపడలేక, చివరికీ ఒకరికి తెలియకుండా ఒకరు తమ ప్రేమను త్యాగం చేస్తే.. ఎలా ఉంటుంది అనే లవ్ పాయింట్ ను కూడా ఈ సినిమాలో శేఖర్ కమ్ముల చాలా బలంగా చూపించబోతున్నాడట. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి వస్తుండటం మరో విశేషం.