నిరుద్యోగులకు ఇస్రో శుభవార్త.. భారీ వేతనంతో జాబ్స్..?

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 24 ఉద్యోగాల భర్తీ కోసం ఇస్రో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.56,100 వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 21 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల […]

Written By: Navya, Updated On : April 4, 2021 6:53 pm
Follow us on

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 24 ఉద్యోగాల భర్తీ కోసం ఇస్రో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.56,100 వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 21 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇస్రోలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, పర్చేస్ అండ్ స్టోర్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నేషనల్ కెరీర్ సర్వీసెస్ పోర్టల్ లో రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

బెంగళూరు, చెన్నై, భోపాల్, అహ్మదాబాద్, గువాహటి, ఇతర పట్టణాల్లో రాతపరీక్ష జరగనుంది. https://www.isro.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 24 ఉద్యోగాలలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 6 ఉండగా అకౌంట్స్‌ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 6, పర్చేజ్‌ అండ్‌ స్టోర్‌ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 12 ఉన్నాయి.

ఎంబీఏ, డిగ్రీ, పీజీ చదివిన అభ్యర్థులు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, పర్చేజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏసీఏ, ఎఫ్‌సీఏ లేదా ఏఐసీడబ్ల్యూఏ, ఎఫ్‌ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, బీకామ్‌, ఎంకామ్ చదివిన అభ్యర్థులు అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు రూ.250 కాగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజు లేదు.