https://oktelugu.com/

Ileana shares : నా బాడీలో ప్రతీ ఇంచు ఇలానే ఉంటుంది – ఇలియానా 

Ileana shares : ఇటీవల ఇలియానా తన ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేసింది. అందులో కాస్త లావుగా కనిపించింది. దీంతో నెటిజన్లు ఆమె శరీరాకృతిపై ట్రోల్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘అందంగా కనిపించేందుకు ఎన్నో యాప్స్ ఉన్నాయి. వాటితో సులభంగా తమని తాము మార్చుకోవచ్చు. కానీ ఆ యాప్స్ అన్నింటిని డిలీట్ చేశానని గర్వంగా చెబుతున్నా. నేను ఇదే, ఇలానే ఉంటాను. బాడీలో ప్రతీ ఇంచు ఇలానే ఉంటుంది. దీనికి నేను ఫీలవ్వడం లేదు’ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 5, 2022 / 06:11 PM IST
    Follow us on

    Ileana shares : ఇటీవల ఇలియానా తన ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేసింది. అందులో కాస్త లావుగా కనిపించింది. దీంతో నెటిజన్లు ఆమె శరీరాకృతిపై ట్రోల్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘అందంగా కనిపించేందుకు ఎన్నో యాప్స్ ఉన్నాయి. వాటితో సులభంగా తమని తాము మార్చుకోవచ్చు. కానీ ఆ యాప్స్ అన్నింటిని డిలీట్ చేశానని గర్వంగా చెబుతున్నా. నేను ఇదే, ఇలానే ఉంటాను. బాడీలో ప్రతీ ఇంచు ఇలానే ఉంటుంది. దీనికి నేను ఫీలవ్వడం లేదు’ అని తెలిపింది.

    Ileana

    ఏది ఏమైనా ఈ  ఫేడ్ అవుట్ హీరోయిన్ల వ్యవహార శైలి నిజంగా విచ్చలవిడితనం తో ఉంటుంది.  ప్రస్తుతం  గోవా సుందరి ఇలియానా పరిస్థితి ఇలాగే ఉంది.   ఒకప్పుడు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే..  నో  నా రేంజ్ బాలీవుడ్ అంటూ  గొప్పలు పోయిన ఈ బ్యూటీ  చివరకు తెలుగు చిన్నాచితకా హీరోలతో కూడా రొమాన్స్ కి సిద్దం అంటుంది.

    అన్నట్టు  ‘హీరోయిన్  ఇలియానా‘కి  ఇంకా  ఒక కోరిక మిగిలిపోయిందని  తెగ ఇదైపోతూ  ఆమె తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధ పడుతుంది.  ఇంతకీ ఆ కోరిక ఏమిటనేగా..   బాలీవుడ్ లో హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో మసాలాకే సెగ పుట్టేలా ఒక బోల్డ్  సాంగ్ చేయాలని ఇలియానా ఎప్పటి నుంచో  సరైన  అవకాశం కోసం ఎదురు చూస్తోంది. 

    అయితే, ఇలియానాకి ఛాన్స్ ఇచ్చే హీరో మాత్రం దొరకడం లేదు.  అజయ్  దేవగణ్ తో, అలాగే అక్షయ్ కుమార్ తో కూడా   ఇలియానా చాలా క్లోజ్ గా మూవ్ అయింది.  అక్షయ్ కుమార్ ఆమెకు ఛాన్స్ కూడా ఇచ్చాడు.  అయినా ఆ సినిమా ఆమెకు ఏ రకంగానూ  ప్లస్ కాలేదు. అందుకే, బాలీవుడ్ లో స్టార్ డమ్ సాధించాలి అంటే..  మంచి మసాలా సాంగ్ ఒకటి తనకు పడాలి అని  ఇలియానా కోరుకుంటుంది.

     

    ఎప్పటి నుండో ఇలియానాకి ఆ  కోరిక  ఉందట.  బాలీవుడ్ లో ఇప్పటికే ఈ బ్యూటీ  కొన్ని  సినిమాల్లో నటించింది. ఇంకా కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి  ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇలియానా    హిందీలో బిజీ కాకపోవడం వెనుక చాల వ్యవహారాలే ఉన్నాయని టాక్.