AP Politics: అధికార వైసీపీలో ఎప్పటి నుంచో అంతర్గత పోరు సాగుతోంది. అయితే ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ.. లేదంటే ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి అన్నట్టు కుమ్ములాటలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా పెదకాకాని మల్లన్న సన్నిధి సాక్షిగా మంత్రి, ఎమ్మెల్యే మధ్య అగ్గి రాజుకుంది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు పెదకాకాని మల్లన్న ఆలయ ఖాతాను మళ్లించుకున్నట్టు ఎమ్మెల్యే రోశయ్య ఆరోపిస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వద్ద పనిచేసే వ్యక్తికి, అలాగే ఆయన ఇంటి వద్ద పనిచేసే ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖాతా నుంచి జీతాలు వెళ్లేవి. కాగా ఈ విషయం తెలుసుకున్న మంగళ గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈవో పానకాల రావు మీద సీరియస్ అయ్యారు. ఆ జీతాలను కూడా నిలపి వేయించారు. అంతే కాకుండా పానకాల రావును అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ రామకృష్ణారెడ్డి ఆదేశించారు.
Also Read: బడ్జెట్ పత్రాలను ఎర్రని వస్త్రంలో తేవడానికి అసలు కారణం ఇదే..!
ఇక అప్పటి నుంచి పానకాల రావు తన పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ జీతాలను కాస్తా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి ఇవ్వాలంటూ ఆ దేవ స్థానం ఈవోగా ఉన్న శ్రీనివాసరెడ్డికి మంత్రి ఆదేశాలు పంపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోశయ్య అలెర్ట్ అయ్యారు. ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వడం కుదరదంటూ ఈవోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మంత్రి ఈవో మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యారు.
ఇక ఇదే విషయం మీద రీసెంట్ గా జరిగిన ఓ మీటింగ్ లో మంత్రి, రోశయ్య నడుమ వాగ్వాదం జరిగిందంట. కాగా తన ఆదేశాలను ధిక్కరించారంటూ ఈవో శ్రీనివాస రెడ్డి మీద బదిలీ వేటు వేశారు. అయితే ఈ బదిలీని ఎమ్మెల్యే రోశయ్య ఒప్పుకోలేదు. ఎలాగైనా తన వర్గీయుడు పానకాలరావును పెద్దకాకాని మల్లన్న ఆలయ ఈవోగా నియమించాలని అనుకుంటున్నారు. కానీ అక్కడున్న ఎమ్మెల్యే రోశయ్య దీన్ని అడ్డుకుంటున్నారు.
ఇక పానకాల రావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు మంత్రి. అయితే ఇదే ఉత్తర్వుల మీద రోశయ్య సీరియస్ అయ్యారు. పానకాల రావు చేరొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మంత్రి సీరియస్ అయి.. ప్రస్తుతం అక్కడ పని చేస్తున్న ఈవో శ్రీనివాస రెడ్డి మీద గతంలో అవకతవకలు జరిపాడంటూ సస్పెన్షన్ వేటు వేశారు. ఆ ప్లేస్ లో పానకాల రావును నియమించాలని మంత్రి అనుకుంటున్నారు. కాగా ఆ ప్లేస్ లో తన వర్గీయులే ఉండాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు పట్టు బడుతున్నారు. ఇలా మంత్రి, ఎమ్మెల్యేల పంతం కారణంగా ఇప్పటికే ఏడాదిలో నలుగురు ఈవోలు మారిపోయారు. మరి ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.
Also Read: ఆర్యవైశ్యులను రెచ్చగొడుతున్న వైసీపీ? నర్సాపురంలో ఎంపీ దిష్టిబొమ్మలు దహనం