Israel Hamas Ceasefire: ప్రపంచ శాంతి దూతను… అనేక దేశాల మధ్య యుద్ధాలను ఆపాను.. ఇలానే ప్రచారం చేసుకుంటున్నాడు కదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ ట్రంప్ చేసుకున్నంత గొప్పగా ప్రపంచశాంతిలో అతని పాత్ర ఏమీ ఉండడం లేదు. సింపుల్గా చెప్పాలంటే అమెరికా సామ్రాజ్యవాధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడంలో ట్రంప్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాడు. ఈ మాట అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇరాన్ మీద దాడులు చేసి.. సిరియా మీద బాంబుల వర్షం కురిపించి.. ఇలా రకరకాల యుద్ద వ్యవహారాలకు పాల్పడిన ట్రంప్.. తనను తాను శాంతి దూతగా పేర్కొనడం నిజంగా ఆశ్చర్యకరమే. పైగా పుతిన్ తో సరదాగా ఉంటూనే.. ఉక్రెయిన్ కు వెనుక నుంచి సపోర్ట్ చేస్తున్నాడు. అయితే అలాంటి ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయిల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ప్రపంచం మీద నేటికీ అమెరికా పెత్తనం సడలిపోలేదు. అలాగని ప్రపంచం మొత్తం ట్రంప్ మాట వినడం లేదు. దానికి బలమైన ఎగ్జాంపుల్ ఇది. ఇజ్రాయిల్, హమాస్ మధ్య పీస్ డీల్ తొలి దశ అమల్లోకి వచ్చింది. దీని వెనక ట్రంప్ దాగి ఉన్నాడని ప్రచారం జరిగింది. గ్లోబల్ మీడియా కూడా ట్రంప్ ను పొగుడుతూ కథనాలను ప్రసారం చేస్తోంది. అయితే ఇందులో వాస్తవం లేదని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత తమ దళాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఇజ్రాయిల్ ప్రకటించింది. దీంతో గడిచిన రెండు సంవత్సరాలుగా గుడారాలలో తలదాచుకుంటా పాలస్తీనా దేశస్థులు తమ సొంత దేశాలకు వెళ్తున్నారు. అయితే గాజ మొత్తం సర్వనాశనం అయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఆయుధాలను వదిలేది లేదని హమాస్ నేతలు చెబుతున్నారు. దీంతో యుద్ధం ముగిసిపోదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య పీస్ డీల్ లో భాగంగా తొలిదశ అమల్లోకి వచ్చిన తర్వాత దీని వెనక ట్రంప్ అల్లుడు జా రెడ్ కుష్నర్ ఉన్నాడని తెలుస్తోంది. మొదట్లో చర్చలకు హమాస్ ఓకే చెప్పినప్పటికీ ఇజ్రాయిల్ అంగీకరించలేదు. దీంతో అమెరికా రాయబారి స్టీల్ విట్కస్ తో కలిసి కుష్నర్ రంగంలోకి దిగాడు. ఇతడు స్వతహాగానే వ్యాపారి కావడంతో ఇజ్రాయిల్ అధిపతి నెతన్యహూ తో చర్చలు జరిపాడు.. దీంతో కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరేలా చేశాడు. ఆ తర్వాత చర్చలలోనూ కుష్నర్ పాల్గొంటారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ కు దక్కాల్సిన క్రెడిట్ అతని అల్లుడికి చెందింది. వచ్చే అమెరికా ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున అతడే అధ్యక్షుడిగా బరిలో ఉంటాడని చర్చ కూడా మొదలైంది.