హాట్ బ్యూటీ పరిస్థితి బాగా లేదు !

హాట్ బ్యూటీ నభా నటేష్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోతున్నాయి. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతు సరసన నభ నటేష్ ఫిక్స్ అయిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. నిజానికి మొదట నభానే హీరోయిన్ గానే ఫిక్స్ చేశారు. కానీ ఏమైందో ఏమో.. మొత్తానికి నభాని పక్కకి తప్పించి, నభా ప్లేస్ లో రాశి ఖన్నా బెటర్ అనుకుని.. చైతు సరసన రాశి ఖన్నాను […]

Written By: admin, Updated On : April 2, 2021 2:28 pm
Follow us on


హాట్ బ్యూటీ నభా నటేష్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోతున్నాయి. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతు సరసన నభ నటేష్ ఫిక్స్ అయిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. నిజానికి మొదట నభానే హీరోయిన్ గానే ఫిక్స్ చేశారు. కానీ ఏమైందో ఏమో.. మొత్తానికి నభాని పక్కకి తప్పించి, నభా ప్లేస్ లో రాశి ఖన్నా బెటర్ అనుకుని.. చైతు సరసన రాశి ఖన్నాను ఫైనల్ చేశారట.

మరి ‘థాంక్యూ’ సినిమాలో నాగ చైతన్య సరసన మెయిన్ హీరోయిన్ గా రాశి ఖన్నాకి ఛాన్స్ అంటే.. ఆమెకు ఇది గోల్డన్ ఛాన్సే. ఈ మధ్య రాశికి తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఇలాంటి టైంలో ఆమెకు చైతు సరసన మెయిన్ లీడ్ అంటే ఆమె కెరీర్ కి ఇది పెద్ద ప్లస్ కానుంది. కానీ రాశి ప్లస్, నభాకి పెద్ద మైనస్ అయ్యేలా ఉంది. చైతు సినిమాలో ఛాన్స్ వచ్చింది అనుకుని నభా తనకొచ్చిన సుధీర్ బాబు సినిమాని కూడా వదులుకుంది.

ఇప్పుడు రెండిటికి చెడ్డ రేవడిలా తయారైంది నభా పరిస్థితి. అసలు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్‌ లో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన తరువాత, నభాకి వరుసగా అవకాశాలు వస్తాయి, ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ చివరకు ఈ బ్యూటీకి చిన్నాచితకా హీరోల సినిమాల్లో కూడా ఇప్పుడు ఛాన్స్ లు వచ్చేలా కనిపించడం లేదు.

అందుకే సోషల్ మీడియాలో ఈ మధ్య హాట్ అందాలతో ఫోటో షూట్ లు చేస్తూ హడావుడి చేస్తోంది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం ఆమె నితిన్ సరసన ‘మ్యాస్ట్రో’ సినిమా చేస్తోంది. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ అయితే.. ఇక నభా కెరీర్ ఎండ్ అయినట్టే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్