https://oktelugu.com/

మరణ మృదంగం: గాంధీలో కరోనా కల్లోలం

కరోనా మరణాలకు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు పొంతన లేకుండా పోతోందని మరోసారి రుజువైంది. కరోనాపై ప్రభుత్వం అంత సీరియస్‌నెస్‌ తీసుకురాకపోవడంతో ప్రజల్లోనూ ఇప్పుడు ఆ భయం పెద్దగా కనిపించడంలేదు. కానీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనేది ఎవరికీ తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ భయంకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రత తక్కువగా ఉందన్న ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మొద్దన్న విషయం దీని ద్వారా నిరూపితమైంది. కేవలం […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 2, 2021 2:47 pm
    Follow us on

    Gandhi Hospital
    కరోనా మరణాలకు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు పొంతన లేకుండా పోతోందని మరోసారి రుజువైంది. కరోనాపై ప్రభుత్వం అంత సీరియస్‌నెస్‌ తీసుకురాకపోవడంతో ప్రజల్లోనూ ఇప్పుడు ఆ భయం పెద్దగా కనిపించడంలేదు. కానీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనేది ఎవరికీ తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ భయంకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది.

    సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రత తక్కువగా ఉందన్న ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మొద్దన్న విషయం దీని ద్వారా నిరూపితమైంది. కేవలం 24 గంటల వ్యవధిలో గాంధీ ఆసుపత్రిలో ఏకంగా 17 మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా కేసుల పెరుగుదల మాత్రమే కాదు.. మరణాలు సైతం వేగంగా పెరుగుతున్నాయన్న కఠిన నిజం కళ్ల ముందు కనపడేలా వాస్తవం ఇప్పుడు బయటకు వచ్చింది.

    రోజువారీ బులిటెన్లలో పేర్కొన్న వివరాలకు.. వాస్తవానికి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉందన్నది ఇప్పుడు మరోసారి స్పష్టమైంది. కరోనా కారణంగా బుధవారం నలుగురు మరణించినట్లుగా రోజువారీగా విడుదల చేసే ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల 24 గంటల వ్యవధిలో ఏకంగా 17 మంది మరణించిన వైనం ఇప్పుడు సంచలనమైంది.

    తాజాగా.. మరణించిన వారంతా వారం.. రెండు వారాలపాటు పలు ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిని మూడు రోజుల క్రితం గాంధీకి తరలించారు. తీవ్రమైన శ్వాస సంబంధిత ఇబ్బందులతో వెంటిలేటర్ పై ఉన్న వీరిని వెంటనే ఐసీయూలో చేర్చి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మరణించిన వారిలో ఎక్కువ మంది 45 – 95 ఏళ్ల మధ్యలో ఉన్నట్లుగా తేలింది. మృతుల్లో హైదరాబాదీయులు ఎక్కువ మంది కాగా.. పలువురు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఈ లెక్కలను చూసైనా ప్రజలు అలర్ట్‌గా ఉంటే చాలా మంచిది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్