
సినీ లోకంలో అందాలకు, అలాగే అందమైన భామలకు, ఇక ఆ అందాలను దాచుకోకుండా ప్రదర్శించే సుందరాంగులకు కొదవేమీ లేదు. అయితే, ప్రస్తుతం సుందరాంగులందరూ కరోనా సెకెండ్ వేవ్ తో ఖాళీగా ఉంటున్నారు. డబ్బుకు బాగా అలవాటు పడిన హీరోయిన్లు కదా, అందుకే ఖాళీగా కూర్చోలేక యాడ్స్ ఏమైనా దొరుకుతాయా అని ఆరా తీస్తోన్న హీరోయిన్ల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతుంది.
నిజానికి సినిమా ప్రపంచంలో ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అంతా లెక్కలే ఉంటాయి. షాప్ ఓపెనింగ్ కి వచ్చినా లక్షలు వస్తాయి. తమ సోషల్ మీడియా ఎకౌంట్ లో చిన్న పోస్ట్ పెట్టినా లక్షల సంపాదన ఉంటుంది. అందుకే హీరోయిన్లు కూడా గ్యాప్ లేకుండా సంపాదనకు అలవాటు పడిపోతారు. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అందరికీ ఫ్రీ టైం దొరికింది.
అయితే, ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు అంతా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కి కొత్త ఎనర్జీ వచ్చింది. అందుకే డిజిటల్ యాడ్స్ ఇస్తోన్న కంపెనీలు కూడా రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. అందుకే ప్రతి హీరోయిన్ బ్రాండింగ్స్ చేస్తూ ఈ ఖాళీ టైంలో కూడా బాగానే వెనుకేసుకుంటుంది. అయితే అన్యుహంగా ఇప్పుడు హీరోయిన్ల మధ్య బ్రాండింగ్స్ విషయంలో పోటీ పెరిగింది.
నేను తక్కువ రెమ్యునరేషన్ కే బ్రాండ్ ను ప్రమోట్ చేస్తాను అంటూ ఓ స్టార్ హీరోయిన్ ఓ కంపెనీని అప్రోచ్ అయింది. దాంతో ఆ కంపెనీ అప్పటికే కమిట్ అయిన మరో స్టార్ హీరోయిన్ ను పక్కన పెట్టి, తమ శానిటైజర్ బ్రాండ్ ను తమను అప్రోచ్ అయిన హీరోయిన్ చేత ప్రచారం చేయించారు. మిగిలిన హీరోయిన్స్ కూడా రెమ్యునరేషన్స్ ను తగ్గించుకుని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. మొత్తానికి డిజిటల్ యాడ్స్ కోసం హీరోయిన్స్ మధ్య పోటీ బాగా పెరిగిపోయింది.