https://oktelugu.com/

రష్మిక కావాల్సిందే.. స్టార్ హీరో ఆశ !

క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’కి ఉన్న డిమాండ్ మాములుగా లేదు. వరసగా ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. పైగా తెలుగుతో పాటు తమిళంలోనూ అటు హిందీలోనూ రష్మికకు ఛాన్స్ లు వస్తుండటం విశేషం. ఇప్పటికే తన సక్సెస్ ల పరంపరలో మహేష్ తో నటించేసింది. బన్నీ సరసన కూడా చేస్తోంది. త్వరలో ఎన్టీఆర్ సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్ గా అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అటు తమిళంలోనూ అక్కడి స్టార్ […]

Written By:
  • admin
  • , Updated On : April 4, 2021 / 06:15 PM IST
    Follow us on


    క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’కి ఉన్న డిమాండ్ మాములుగా లేదు. వరసగా ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. పైగా తెలుగుతో పాటు తమిళంలోనూ అటు హిందీలోనూ రష్మికకు ఛాన్స్ లు వస్తుండటం విశేషం. ఇప్పటికే తన సక్సెస్ ల పరంపరలో మహేష్ తో నటించేసింది. బన్నీ సరసన కూడా చేస్తోంది. త్వరలో ఎన్టీఆర్ సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్ గా అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అటు తమిళంలోనూ అక్కడి స్టార్ హీరో విజయ్ సినిమాలోనూ మెయిన్ హీరోయిన్ గా చేయబోతుంది.

    ఇప్పటికే మరో తమిళ స్టార్ హీరో కార్తి పక్కన నటించింది. అందుకే రష్మికతో నటిస్తే.. తమ రేంజ్ పెరగడంతో పాటు, తమ సినిమాకు ఇతర భాషల్లో వచ్చే మార్కెట్ కూడా పెరుగుతుందని ఏవరేజ్ హీరోలు ఫీల్ అవుతున్నారట. అందుకే ఇప్పుడు వాళ్ళ సినిమాలో హీరోయిన్ అనగానే.. వాళ్ళ లిస్ట్ లో ముందు రష్మిక పేరే ఉంటుందట. ఈ క్రమంలో హీరో రామ్ కూడా తన కొత్త సినిమాలో రష్మికనే హీరోయిన్ గా కావాలని పట్టు బడుతున్నాడు.
    ప్రస్తుతం రామ్ తమిళ క్రియేటివ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ్, తెలుగు భాషల్లో రూపొందే ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ అయితే మార్కెట్ పరంగా అలాగే సినిమా పై వచ్చే క్రేజ్ పరంగా కూడా బాగా ప్లస్ అవుతుందని, అందుకే ఆమెను హీరోయిన్ గా తీసుకుందామని రామ్, డైరెక్టర్ ను కోరుతున్నాడట. కాగా ఈ సినిమా మేకర్స్ త్వరలోనే రష్మిక డేట్స్, పారితోషికం గురించి మాట్లాడి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారనేది ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది,