https://oktelugu.com/

హీరోయిన్ కి ఆవేదన నుండి జ్ఞానోద‌యం !

‘ఉయ్యాల జంపాల’ అంటూ అమాయకత్వంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు గిలిగింతలు పెట్టిన బుల్లితెర న‌టి ‘అవికాగోర్’. ఆ సినిమా తరువాత నాలుగైదు చిత్రాలలో మెరిసినా తళుకులు రాలలేదు. దాంతో అమ్మడు కెరీర్ కొన్నేళ్లు పాటు చీకట్లో కొట్టుమిట్టాడింది. మళ్ళీ చాల గ్యాప్ తరువాత అవికాకి దొరక్క దొరక్క ఒక సినిమా దొరికింది. అది కూడా ఆది సాయి కుమార్ హీరోగా రాబోతున్న ‘అమరన్‌’ అనే సినిమా. ఈ సినిమాలో అవికా గోర్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. అయితే రీఎంట్రీ […]

Written By:
  • admin
  • , Updated On : April 26, 2021 11:41 am
    Follow us on

    AVika
    ‘ఉయ్యాల జంపాల’ అంటూ అమాయకత్వంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు గిలిగింతలు పెట్టిన బుల్లితెర న‌టి ‘అవికాగోర్’. ఆ సినిమా తరువాత నాలుగైదు చిత్రాలలో మెరిసినా తళుకులు రాలలేదు. దాంతో అమ్మడు కెరీర్ కొన్నేళ్లు పాటు చీకట్లో కొట్టుమిట్టాడింది. మళ్ళీ చాల గ్యాప్ తరువాత అవికాకి దొరక్క దొరక్క ఒక సినిమా దొరికింది. అది కూడా ఆది సాయి కుమార్ హీరోగా రాబోతున్న ‘అమరన్‌’ అనే సినిమా. ఈ సినిమాలో అవికా గోర్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది.

    అయితే రీఎంట్రీ తనకు కొత్త లైఫ్ అని అవికా చెప్పుకొచ్చింది. అవికా ఇలా చెప్పడం వెనుక నాలుగేళ్లు ఆమె పడిన మానసిక వేదన ఉంది. ఒంటరితనంతో ఆమె ఒకప్పుడు కంగారుపడేది. చుట్టూ అందరూ ఉన్నా తానెప్పుడూ ఒంటిరినే అని ఫీల్ అయ్యేది అవికా. నిజానికి గతేడాది వరకూ ఈ ప్రపంచంతో పాటు త‌న‌ జీవితం గురించి తరచూ తప్పుగానే ఆలోచించేదాన్న‌ని ఆమె ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేద‌న చెందినప్పుడు గానీ, ఆమె మానసిక పరిస్థితి ప్రపంచానికి అర్ధం కాలేదు.

    పడిలేచిన కెరటానికి విలువ ఉంటుంది, అవికా సినిమా జీవితం కూడా ఇప్పుడు అలాంటిదే. త‌న‌లోని చెడు ఆలోచనల నుంచి బయటప‌డేందుకు, త‌న‌ చుట్టూ మళ్ళీ సినీ లోకాన్ని ఏర్పాటు చేసుకుంది. నెగెటివ్‌ ఆలోచనల వల్ల కలిగే ఇబ్బందిని నెగ్గింది. భ‌యం త‌న‌ను వెంటాడిన‌ట్టు ఊహించుకుని మరీ భయపడే ‘అవికా’లో ఇప్పుడు దైర్యం మాత్రమే ఉంది.

    మొత్తానికి భయపెట్టే ఆలోచ‌న‌ల‌తో ఎన్నో సంవత్సరాలు తనలో తానే ఇబ్బందిపడిన‌ అవికా గోర్ ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ సినిమా ప్రయత్నాలు మొదలెట్టింది. ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ సక్సెస్ కావాలని ఆశిద్దాం. అన్నట్టు అమ్మడు వ్యక్తిగత ప్రేమ గురించి కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. ఏది ఏమైనా ఇప్పుడు తన జీవితంలో అవేమి లేవు అట. ఈ యంగ్ బ్యూటీకి పూర్తి జ్ఞానోద‌యం అయిందట.