
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” సీక్వెల్ పై ఎట్టకేలకూ క్లారిటీ వచ్చింది. బంగార్రాజు సినిమా జులై రెండో వారం నుంచి చిత్రీకరణ మొదలు కానుందని నాగార్జున తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నిజానికి బంగార్రాజు సినిమాని ఎప్పుడో స్టార్ట్ చేద్దామనుకుని నాగార్జున భావించినా బిగ్ బాస్ షో, వేరే సినిమాలు, మరికొన్ని కారణాల వలన ఇంతకాలం లేట్ అవుతూ వచ్చింది.
దాంతో అక్కినేని అభిమానులు గత నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా అప్ డేట్ కోసం కళ్ళు వాచిపోయేలా ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ సినిమా గురించి ఇన్నాళ్లు అధికారికంగా అతిగతి లేకుండా పోవడంతో చివరకు ‘బంగార్రాజు’ రాక పై నాగ్ ఫ్యాన్స్ లో కూడా నిరాశ కమ్ముకుంది. వారిలో ఉన్న ఆసక్తి కూడా కరిగిపోయినా తరువాత గానీ, మొత్తానికి ‘బంగార్రాజు’ పరిస్థితి ఓ కొలిక్కి రావడం విశేషం. నాగ్ ఈ సినిమాని జులై నుండి డేట్స్ ఇచ్చాడు.
ఎంతైనా అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కీలకమైనది. 2016 లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. అప్పటివరకు నాగార్జున హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ సినిమా కింగ్ కెరీర్ కి పెద్ద బలాన్ని ఇచ్చింది. నాగ్ స్టార్ డమ్ మీద ఏర్పడిన అనుమాలన్నిటిని పటాపంచలు చేసింది. ఈ సినిమాలో నాగ్ రెండు పాత్రల్లో నటించగా అందులో బంగార్రాజు పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
ఆ ఊపులోనే సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇంతకాలం తరువాత ఇప్పుడన్నీ సెట్ కావటంతో ఈ మూవీని మొదలెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఈ సినిమా పై వస్తోన్న అనేక ఊహాగానాలకు తెరపడాలంటే మేకర్స్ నుండి అధికారక ప్రకటన రావాల్సిందే.