https://oktelugu.com/

భారత్ ను ఆవహించిన కరోనా

భారతదేశాన్ని కరోనా ఆవహించినట్టే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ కరోనా విలయానికి మరణాలు సైతం భారీగా సంభవిస్తున్నాయి. తాజాగా కరోనాధాటికి గడిచిన 24 గంటల్లోనే 2812 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా పరిస్థితికి అద్దం పడుతోంది. ఆదివారం 14,02,367 మందికి కరోనా టెస్టులు చేయగా ఏకంగా 3,52,991 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కి చేరాయి. ఇప్పటివరకు 1,92,123 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుండడం […]

Written By: , Updated On : April 26, 2021 / 10:31 AM IST
Follow us on

Medical

భారతదేశాన్ని కరోనా ఆవహించినట్టే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ కరోనా విలయానికి మరణాలు సైతం భారీగా సంభవిస్తున్నాయి.

తాజాగా కరోనాధాటికి గడిచిన 24 గంటల్లోనే 2812 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా పరిస్థితికి అద్దం పడుతోంది. ఆదివారం 14,02,367 మందికి కరోనా టెస్టులు చేయగా ఏకంగా 3,52,991 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కి చేరాయి. ఇప్పటివరకు 1,92,123 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 10శాతం ఉండగా.. తాజాగా ఈ కేసుల వాటా ఏకంగా 15.82శాతానికి పెరిగింది. కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య 28,13,658కి చేరింది. భారీగా పెరుగుతున్న కేసులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆందోళన కలిగిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 83.05 శాతానికి పడిపోయింది. అంతకుముందు 95శాతంగా ఇది ఉండేది. 1.43 కోట్ల మంది వైరస్ ను జయించారు.

ఇక దేశవ్యాప్తంగా అత్యధికంగా కేసులు, మరణాలు మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 66వేల కేసులు బయటపడగా.. ఒక్కరోజులోనే 832 మంది మరణించారు. ఆ తర్వాత ఢిల్లీలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 22933మంది కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ లలో వైరస్ విస్తరిస్తోంది.

కేంద్రం ఇప్పటికే లాక్ డౌన్ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. భారీగా కరోనా ప్రబలే ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆంక్షలు అమలు చేయాలని చూస్తోంది. ఇప్పటికే ముంబైలో లాక్ డౌన్ పెట్టేశారు. మరిన్ని ప్రాంతాల్లో కూడా లాక్ డౌన్ పెట్టాలని యోచిస్తున్నారు.