అలనాటి అందాల తార హేమమాలిని కొత్తగా సినిమాల్లోకి వస్తోన్న రోజులు అవి. అవకాశల కోసం దర్శకుల చుట్టూ నిర్మాతల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్న హేమమాలినికి ఒక నిర్మాత సాయం చేసి.. మొదటి సినిమా ఇప్పించాడు. అయితే అడగకుండానే అవకాశం ఇప్పించిన ఆ నిర్మాత వెనుక అప్పటి ఒక స్టార్ హీరో ఉన్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే.. ధర్మేంద్ర. ధర్మేంద్రకి హేమా అంటే మొదటి నుండి ఇష్టం. ఆమె స్టార్ అవ్వడానికి ధర్మేంద్ర ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. మొత్తానికి ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అనుకోండి.
దాదాపు రెండు సంవత్సరాల నడిచిన వీరి ప్రేమ.. ఆ తరువాత వివాహానికి రెడీ అయ్యారు. అయితే అప్పటికే బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాల కోసం కలిసి పనిచేసిన ఈ జంట హిట్ పెయిర్‌గా ప్రేక్షకాదరణ పొందటమే కాకుండా.. అప్పటి గాసిప్స్ రాయుళ్లకి ఎప్పటికప్పుడు స్టఫ్ ఇచ్చేవాళ్ళు. అయితే అప్పటి తమ ప్రేమ వ్యవహారాల గురించి హేమమాలిని ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఒకానొక సందర్భంలో నేను ధర్మేంద్రకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాను. మా పై అనేక గాసిప్స్ వస్తుండటంతో మా తండ్రిగారు కంగారు పడ్డారు అని చెప్పుకొచ్చింది. అయితే, సాధారణంగా హేమమాలిని ఏదైనా షూట్‌లో పాల్గొంటే.. ఆమె వెంట ‘హేమ అమ్మ’ లేదా ‘హేమ బామ్మ’ సెట్‌కు వెళ్ళేవాళ్ళు.
కానీ, ధర్మేంద్రతో సినిమా చేస్తున్న సమయంలో మాత్రం హేమమాలినితో పాటు ఆమె నాన్న సెట్‌కు వెళ్లేవారట. షూట్ అయ్యేంత వరకూ ఆయన హేమమాలినితోనే ఉన్నారట. అసలు ధర్మేంద్రతో మాట్లాడనివ్వలేదట. ఆ తరువాత కూడా కొన్ని నెలలు పాటు ధర్మేంద్ర – హేమమాలిని ఇద్దర్నీ దూరంగా ఉంచారు ఆమె తండ్రి. అయినా ఆ తరువాత తన తండ్రిని ఎలాగోలా ఒప్పించి మొత్తానికి ధర్మేంద్రనే పెళ్లి చేసుకుంది హేమమాలిని. ఇక ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్న హేమమాలిని అప్పుడప్పుడు సినిమాల్లోన మెప్పిస్తోంది. ఈ క్రమంలోనే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ఆమె బాలయ్య తల్లి పాత్రలో కనిపించి మెప్పించింది. తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘ఆదిపురుష్’లో ఆమె రాముడి తల్లి కౌసల్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Hema malini says her father tried to stop her and dharmendra from spending time alone
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com