spot_img
Homeసినిమా వార్తలుచరణ్ తో చెయ్యట్లేదు.. ఇక శంకర్ పైనే ఆశలు !

చరణ్ తో చెయ్యట్లేదు.. ఇక శంకర్ పైనే ఆశలు !

Gautam-charan
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘గౌతమ్ తిన్ననూరి’ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పించాడని.. చరణ్ కూడా గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ గా ఉన్నాడని.. ఇలా చాల రకాలుగా ఆ మధ్య అనేక రూమర్స్ వినిపించాయి. మళ్ళీ రీసెంట్ గా గౌతమ్ తిన్ననూరి చరణ్ కి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడని.. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా కథ విని బాగుందని అన్నాడని.. నవంబర్ లో దీపావళికి స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెట్టనున్నారని.. ఇలా దాదాపు ఈ సినిమా ఖరారు అయినట్టే అన్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ సినిమా విషయంలో వస్తోన్న వార్తల పై దర్శకుడు గౌతమ్ తిన్నసూరి క్లారిటీ ఇచ్చాడు. తను ప్రస్తుతం జెర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నానని.. ప్రెజెంట్ ఆ సినిమాతోనే ఫుల్ బిజీగా ఉన్నానని.. బయట వస్తోన్న వార్తలు ప్రకారం తానూ ఏ తెలుగు హీరోకు ఇంతవరకు కథ చెప్పలేదని.. నిజానికి నా దగ్గర కథలు కూడా రెడీగా లేవు అని.. ఇక చరణ్‌తో నేను సినిమా చేయనున్నట్టు వస్తున్న వార్తలన్ని అవాస్తవం అని.. మొత్తానికి ఈ డైరెక్టర్ తేల్చి చెప్పాడు. మెగా అభిమానుల అనుమానాలను గౌతమ్ తీర్చేసాడు.

ఇక ‘చరణ్ – శంకర్’ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా క్రేజీ ఎమోషనల్ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ తో గ్రేట్ విజువల్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఎలాగూ శంకర్, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి కాబట్టి.. సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకువస్తున్నారు. పైగా శంకర్ కి తమిళంలో ఫుల్ మార్కెట్ ఉంది, అక్కడ పెద్ద హీరో సినిమాకి అయ్యే రేంజ్ లో మార్కెట్ అవుతుంది. అందుకే ఈ సినిమాకి నిర్మాత అయిన దిల్ రాజు భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version