యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘గౌతమ్ తిన్ననూరి’ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పించాడని.. చరణ్ కూడా గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ గా ఉన్నాడని.. ఇలా చాల రకాలుగా ఆ మధ్య అనేక రూమర్స్ వినిపించాయి. మళ్ళీ రీసెంట్ గా గౌతమ్ తిన్ననూరి చరణ్ కి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడని.. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా కథ విని బాగుందని అన్నాడని.. నవంబర్ లో దీపావళికి స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెట్టనున్నారని.. ఇలా దాదాపు ఈ సినిమా ఖరారు అయినట్టే అన్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ సినిమా విషయంలో వస్తోన్న వార్తల పై దర్శకుడు గౌతమ్ తిన్నసూరి క్లారిటీ ఇచ్చాడు. తను ప్రస్తుతం జెర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నానని.. ప్రెజెంట్ ఆ సినిమాతోనే ఫుల్ బిజీగా ఉన్నానని.. బయట వస్తోన్న వార్తలు ప్రకారం తానూ ఏ తెలుగు హీరోకు ఇంతవరకు కథ చెప్పలేదని.. నిజానికి నా దగ్గర కథలు కూడా రెడీగా లేవు అని.. ఇక చరణ్‌తో నేను సినిమా చేయనున్నట్టు వస్తున్న వార్తలన్ని అవాస్తవం అని.. మొత్తానికి ఈ డైరెక్టర్ తేల్చి చెప్పాడు. మెగా అభిమానుల అనుమానాలను గౌతమ్ తీర్చేసాడు.
ఇక ‘చరణ్ – శంకర్’ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా క్రేజీ ఎమోషనల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో గ్రేట్ విజువల్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఎలాగూ శంకర్, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి కాబట్టి.. సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకువస్తున్నారు. పైగా శంకర్ కి తమిళంలో ఫుల్ మార్కెట్ ఉంది, అక్కడ పెద్ద హీరో సినిమాకి అయ్యే రేంజ్ లో మార్కెట్ అవుతుంది. అందుకే ఈ సినిమాకి నిర్మాత అయిన దిల్ రాజు భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.