Dr Rajasekhar: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి ఎన్టీఆర్, తనకిష్టమైన త్రివిక్రమ్ సినిమాను కూడా వదులుకున్నాడు. కొరటాల చెప్పిన కథ, ఎన్టీఆర్ కి అంత గొప్పగా నచ్చింది. అయితే, కొరటాల కూడా ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. కాగా తాజాగా ఈ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో పాత్ర ఉందట. అయితే, ఆ పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోని తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.

ఎందుకంటే ఎన్టీఆర్ కి సినిమాలో అది బాబాయ్ పాత్ర అట. వెరీ ఎమోషనల్ గా ఉండే ఆ పాత్రలో హీరో రాజశేఖర్ అయితే ఎలా ఉంటుంది ? అంటూ కొరటాల ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కొరటాల ఆలోచనను ఎన్టీఆర్ కూడా అంగీకరిస్తే.. రాజశేఖర్, ఎన్టీఆర్ కి బాబాయ్ గా నటించడం ఖాయం. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: డేంజర్ జోన్లోకి ‘ఎఫ్-3’.. ఒకేసారి అంతమందికి పాజిటివ్..!
ఒకవేళ ఆ విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అయితే.. సినిమా మార్కెట్ కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అని కొరటాల కూడా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు హిందీలో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అవుతుంది. మరి కొరటాల హిందీలో ఏ స్టార్ హీరోని ఒప్పిస్తాడో చూడాలి. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
అన్ని అనుకున్నట్లు జరిగితే సమ్మర్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. అన్నట్టు ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేసారు. పైగా జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఓ పెద్ద సెట్ వేశారు. సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్ లోనే ఉంటుందట. ఎన్టీఆర్ కి చాలా టైం కలిసివస్తుందని కొరటాల శివనే స్వయంగా ఇలా అక్కడ సెట్ వేశామని చెప్పుకొచ్చాడు.
Also Read: ఈ వారం ‘ఓటీటీ’ సినిమాల పరిస్థితేంటి ?
[…] Also Read: ఎన్టీఆర్ కి బాబాయ్ గా డా: రాజశేఖర్ ! […]