https://oktelugu.com/

YCP MLA On Tollywood: టాలీవుడ్ పై వైసీపీ ఎమ్మెల్యే దారుణ వ్యాఖ్యలు

YCP MLA On Tollywood: వైసీపీలో తిట్ల దండకం అందుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే పలుమార్లు ప్రత్యర్థి పార్టీలను పచ్చి బూతులు తిట్టిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం సినిమా వాళ్ల మీద పడ్డారు. వారిని కూడా దుర్భాషలాడుతూ తిట్టడం ఆందోళన కలిగిస్తోంది. తాము ఎవరిని అన్నా ఏమీ అనరనే ధీమాతో వైసీపీ నేతలు హుందాతనాన్ని మరిచిపోయి సామాన్యులకంటే హీనంగా మాట్లాడటం ఆశ్చర్యకరం. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని అసభ్య పదజాలాన్ని […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 10, 2022 6:01 pm
    Follow us on

    YCP MLA On Tollywood: వైసీపీలో తిట్ల దండకం అందుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే పలుమార్లు ప్రత్యర్థి పార్టీలను పచ్చి బూతులు తిట్టిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం సినిమా వాళ్ల మీద పడ్డారు. వారిని కూడా దుర్భాషలాడుతూ తిట్టడం ఆందోళన కలిగిస్తోంది. తాము ఎవరిని అన్నా ఏమీ అనరనే ధీమాతో వైసీపీ నేతలు హుందాతనాన్ని మరిచిపోయి సామాన్యులకంటే హీనంగా మాట్లాడటం ఆశ్చర్యకరం. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని అసభ్య పదజాలాన్ని వాడుతూ విమర్శించారు. దీంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.

    YCP MLA On Tollywood

    YCP MLA Prasanna Kumar Reddy

    ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఇంత తీవ్రంగా మాట్లాడటం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఆయనకు ఏం సంబంధం అని ప్రశ్నలు వస్తున్నాయి. కానీ సినిమా పరిశ్రమపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు గందరగోళం రేపుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కళామ తల్లి బిడ్డలను ఇంత హీనంగా మాట్లాడటంలో ఆంతర్యమేమిటని అందరు ఆందోళన చెందుతున్నారు.

    Also Read: సినీ ఇండస్ట్రీపై జగన్ పంతానికి కారణం తెలిసింది?
    ఒక దశలో సినిమా వాళ్లలో కూడా ఐక్యత కొరవడిందనే అనుమానాలు వస్తున్నాయి. టికెట్ల తగ్గింపుతో పవన్ కల్యాణ్ తప్ప ఎవరు స్పందించలేదు. దీంతో మాకెందుకులే అనే ధోరణిలో ఉండటంతోనే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. నాగార్జున లాంటి వారు కూడా సినిమా టికెట్ల రేట్ల విషయంలో మాకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం. దీంతో వారిని తిడుతూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

    సినిమా పరిశ్రమపై ఇంత నిర్లక్ష్యమా? అసలు వారిని గురించి నిందించడం తిట్టడం వారికేం హక్కు అనే సంశయాలు అందరిలో వస్తున్నా ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ప్రజాప్రతినిధులైతే అందరిని తిట్టే అధికారం వారికెక్కడ ఉంటుందని సినిమా వాళ్లు కూడా ఎదురుదాడికి దిగాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏదిఏమైనా నల్లపురెడ్డి చేసిన పనికి అధికార పార్టీ ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే.

    Also Read: రాంగోపాల్ వర్మకు నాన్ వెజ్ పెట్టిన మంత్రి పేర్ని నాని.. 2 గంటలుగా చర్చలు

    Tags