ఇప్పటికీ ఆ గాత్రం విభిన్నమైనదే.. కానీ గడ్డం వల్లే ఆయన అలా !

అవి ‘విజయావారు’ మాయాబజార్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నద్ధం అవుతోన్న రోజులు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు ఏమిటయ్యా ? అంటూ నాగిరెడ్డి, కేవీరెడ్డి పై చిరాకు పడుతూనే ఇక తప్పక అంగీకరించిన కాలం అది. అభిమన్యుడిగా ఏఎన్నార్, ఘటోత్కచుడిగా యస్వీఆర్ ఇలా కీలక పాత్రల్లో అప్పటికే నటీనటుల ఎంపిక పూర్తయింది. అయితే, నిర్మాత నాగిరెడ్డికి మాత్రం నటుల ఎంపికలో సంతృప్తి లేదు, అది దర్శకుడు కేవీరెడ్డికి బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ, ఆయన ఎన్టీఆర్ అయితేనే శ్రీకృష్ణుడిగా బాగుంటుందని పట్టుబట్టి […]

Written By: admin, Updated On : April 20, 2021 8:58 am
Follow us on


అవి ‘విజయావారు’ మాయాబజార్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నద్ధం అవుతోన్న రోజులు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు ఏమిటయ్యా ? అంటూ నాగిరెడ్డి, కేవీరెడ్డి పై చిరాకు పడుతూనే ఇక తప్పక అంగీకరించిన కాలం అది. అభిమన్యుడిగా ఏఎన్నార్, ఘటోత్కచుడిగా యస్వీఆర్ ఇలా కీలక పాత్రల్లో అప్పటికే నటీనటుల ఎంపిక పూర్తయింది. అయితే, నిర్మాత నాగిరెడ్డికి మాత్రం నటుల ఎంపికలో సంతృప్తి లేదు, అది దర్శకుడు కేవీరెడ్డికి బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ, ఆయన ఎన్టీఆర్ అయితేనే శ్రీకృష్ణుడిగా బాగుంటుందని పట్టుబట్టి ఆ పాత్ర విషయంలో నిర్మాతల అభిప్రాయాలను కూడా కాదు అన్నారు.

ఇప్పుడు మరో పాత్ర విషయంలో కూడా తానూ అలాగే చేస్తే బాగోదు. కానీ, శకుని పాత్రధారికి నిర్మాతలు చెబుతున్న నటుడు సరితూగడు. ఇప్పుడెలా అని కేవీరెడ్డి కంగారు పడుతుండగా.. అప్పుడు ఆయనకు ఒక రంగస్థల నటుడు చటుక్కున గుర్తుకు వచ్చారు. ఆయన శకుని పాత్రధారికి సరిగ్గా న్యాయం చేయగలడు. నేరుగా ఆయనను వెతుక్కుంటూ వెళ్లారు. ఆయనే ప్రఖ్యాత రంగస్థల,సినీ నటుడు సి.ఎస్.ఆర్. ఆంజనేయులు. నటుడిగా సి.ఎస్.ఆర్. ప్రతిభ గురించి చెప్పాలంటే.. మాయాబజార్ సినిమాలో శశిరేఖకూ, లక్షణ కుమారునికి పెళ్ళి వేడుక జరిగే సన్నివేశం గుర్తుతెచ్చుకోండి.

మగపెళ్ళివారి విడిది ఇంటికి, పెండ్లి పెద్దలుగా వచ్చిన శర్మ, శాస్త్రులు నానా గందరగోళం పడుతుంటే.. వాళ్లను ఛీత్కరించుకుంటూ సీఎస్ఆర్ పలికే డైలాగ్ లు ‘ఆడపెళ్ళివారిని ఏడిపించండర్రా అంటే, మొగపెళ్ళి వారినే మమ్మల్నే ఆటపట్టిస్తున్నారే..’ ఇప్పటికీ ఆ గాత్రం విభిన్నమైనదే. బహుశా డైలాగ్స్ ఆయనలా పలకగలిగే నటుడు మళ్ళీ రాలేదు అంటే అతిశయోక్తి కాదేమో. అంతగా సి.ఎస్.ఆర్ వాయిస్ ఉండేది. ఇప్పటికీ మిమిక్రీ ఆర్టిస్టులు ఆయన వాయిస్ ను ఇమిటేట్ చేసి ఆహుతులను నవ్విస్తుంటారు అంటేనే… ఆయనది ఎంత పెక్యూలర్ వాయిసో అర్ధం చేసుకోవచ్చు.

సీఎస్ఆర్ కంఠస్వరం తెలుగువాడు తెలుగు మాట్లాడుతున్నంత కాలం తెలుగు గుండెల మధ్యే కదలాడుతూ ఉంటుంది. అయితే ఆయన అలా మాట్లాడటానికి కారణం ఆయన అంత గొప్పగా ఎక్స్ ప్రెషన్స్ ను పలికించలేడనే అపవాదు ఒకటి ఉండేదట ఆయన మీద. పైగా ఆయనకు వచ్చే పాత్రలు కూడా ఎక్కువుగా గడ్డం ఉన్న పాత్రలే. గడ్డంలో హావభావాలు అసలే కనిపించవు. అందుకే వాయిస్ లోనే ఆయన తన ప్రతిభను చూపించేవారు. ఏది ఏమైనా ఆనాటి నటుడి గురించి మనం ఈ నాడు కూడా మాట్లాడుకుంటున్నామంటే అది ఆ నటుడి గొప్పతనమే.