https://oktelugu.com/

ఇది ఒక్క మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం !

మెగాస్టార్.. ఇరవై ఏళ్ల క్రితం అంటే, బాక్సాఫీస్ ను షేక్ చేసేంత వయసు, పరిస్థితులు చిరుకి ఉన్నాయి. కానీ అరవై దాటినా ఇంకా అదే స్టార్ డమ్ ఉంది అంటే.. బహుశా అది ఒక్క చిరుకి మాత్రమే సాధ్యం అనుకుంటా. కలెక్షన్స్ రెమ్యునరేషన్ పరంగా రజినీకాంత్ లాంటి హీరోలు, మెగాస్టార్ కంటే ముందు ఉండొచ్చు, కానీ.. లుక్ పరంగా ఎనర్జీ పరంగా మెగాస్టార్ కి వాళ్ళెవ్వరూ పోటీ రాలేరు. తెలుగులో బాలయ్య ఇప్పటికీ డ్యాన్స్ లతో ఫైట్ […]

Written By:
  • admin
  • , Updated On : March 29, 2021 / 03:38 PM IST
    Follow us on


    మెగాస్టార్.. ఇరవై ఏళ్ల క్రితం అంటే, బాక్సాఫీస్ ను షేక్ చేసేంత వయసు, పరిస్థితులు చిరుకి ఉన్నాయి. కానీ అరవై దాటినా ఇంకా అదే స్టార్ డమ్ ఉంది అంటే.. బహుశా అది ఒక్క చిరుకి మాత్రమే సాధ్యం అనుకుంటా. కలెక్షన్స్ రెమ్యునరేషన్ పరంగా రజినీకాంత్ లాంటి హీరోలు, మెగాస్టార్ కంటే ముందు ఉండొచ్చు, కానీ.. లుక్ పరంగా ఎనర్జీ పరంగా మెగాస్టార్ కి వాళ్ళెవ్వరూ పోటీ రాలేరు. తెలుగులో బాలయ్య ఇప్పటికీ డ్యాన్స్ లతో ఫైట్ లతో తెగ కష్టపడుతున్నా.. మార్కెట్ పరంగా మెగాస్టార్ దరిదాపుల్లో కూడా బాలయ్య లేడు.

    అందుకే మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారే. ఇక ప్రస్తుతం చిరు చేస్తోన్న సినిమా ‘ఆచార్య’. రోజురోజుకూ ఈ సినిమా మార్కెట్ ఫై కొత్త పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే, తాజగా ఒక విషయం మాత్రం అందర్నీ షాక్ కి గురిచేస్తోంది. సీడెడ్ లో ఈ సినిమాకి 51 కోట్లు వరకు రేటు పలుకుతుందట. నిజానికి మొదటి నుండి చిరుకి సీడెడ్ లో అంత గొప్ప మార్కెట్ ఏమి లేదు. అంటే చిరు స్థాయిలో మార్కెట్ లేదు. కానీ, ఆచార్యకి మాత్రం గతంలో ఎన్నడూ పలకని రేట్లు పలుకుతుండంతో ఆచార్య టీమ్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక ఇప్పటికే నైజాం ఏరియాను 42 కోట్లకు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆచార్య హక్కులను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.

    మొత్తం మీద ఆచార్యకి బాగా డిమాండ్ క్రియేట్ అయింది. దర్శకుడు కొరటాలకు ఇంతవరకూ ప్లాప్ రాకపోవడం కూడా ఈ సినిమా బాగా కలిసొస్తుంది. అందుకే, అన్నిచోట్ల డీల్ కూడా భారీ ఎత్తున ఫిక్స్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా మార్కెట్ మొత్తం 200 కోట్లు దాటేస్తోందని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించడం, పైగా పూజా హెగ్డేను చరణ్ కి హీరోయిన్ గా తీసుకోవడం, ఇలా అన్ని రకాలుగా ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే మార్కెట్ కూడా క్రియేట్ అయింది. మొత్తానికి మెగాస్టార్ – కొరటాల కలయికలో ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్