నాగార్జున సాగర్ బీజేపీ అభ్యర్థి ఖరారు

తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక నాగార్జున సాగర్. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఈ సీటుకు ఉప ఎన్నికలు వచ్చాయి. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. రేపే నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో నాన్చి నాన్చి టీఆర్ఎస్, బీజేపీలు ఈ ప్రకటన చేశాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్ […]

Written By: NARESH, Updated On : March 30, 2021 9:03 am
Follow us on

తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక నాగార్జున సాగర్. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఈ సీటుకు ఉప ఎన్నికలు వచ్చాయి. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. రేపే నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో నాన్చి నాన్చి టీఆర్ఎస్, బీజేపీలు ఈ ప్రకటన చేశాయి.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. జనరల్ కేటగిరిలో ఎస్టీ అయిన రవికుమార్ కు సీటు కేటాయించారు.పలు ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్ గా రవికుమార్ పనిచేశారు. ఆయన ఎంతో సేవ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం ఈ డాక్టర్ కు టికెట్ కేటాయించింది. రవికుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేస్తారు.

ఇక ఇప్పటికే సాగర్ బరిలో టీఆర్ఎస్ చనిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు నోముల భరత్ కు టికెట్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ నుంచి ఉద్దండ పిండ సీనియర్ నేత జానారెడ్డి బరిలోకి దిగుతున్నారు.

ఈనెల 30 వరకు నామినేషన్ల గడువు ఉండగా రేపు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేస్తారు. ఇక ప్రధాన పార్టీలన్నీ తమ తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పుడు సాగర్ ఉప ఎన్నిక అంశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.