https://oktelugu.com/

స్టార్ లోనూ సేవలోనూ మెగాస్టారే !

సీనియర్ హాస్య నటి ‘పావ‌లా శ్యామ‌ల’ తీవ్ర ఇబ్బందులు పడుతుందనే న్యూస్, గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాంతో ఆ న్యూస్ అందరికీ చేరువ అవ్వడంతో ఆమెను ఆదుకోవడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నుండి శ్యామల గారికి మళ్ళీ సాయం అందింది. గతంలో ఆమె కష్టాలు తెలుసుకొని మెగాస్టార్ చిరంజీవి 2 ల‌క్ష‌లు రూపాయలు అందించిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆమెకి […]

Written By:
  • NARESH
  • , Updated On : May 19, 2021 / 02:25 PM IST
    Follow us on

    సీనియర్ హాస్య నటి ‘పావ‌లా శ్యామ‌ల’ తీవ్ర ఇబ్బందులు పడుతుందనే న్యూస్, గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాంతో ఆ న్యూస్ అందరికీ చేరువ అవ్వడంతో ఆమెను ఆదుకోవడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నుండి శ్యామల గారికి మళ్ళీ సాయం అందింది. గతంలో ఆమె కష్టాలు తెలుసుకొని మెగాస్టార్ చిరంజీవి 2 ల‌క్ష‌లు రూపాయలు అందించిన సంగతి తెలిసిందే.

    అయితే మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆమెకి ఆర్థిక సాయం చేసి, తన పెద్ద మనసును చాటుకున్నారు. 1,01,500 రూపాయల చెక్ ని ఆమె కోసం ఖర్చు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఆమెకు స‌భ్య‌త్వ‌ కార్డ్ ఇప్పించడం కోసం మెగాస్టార్ ఆ మొత్తాన్ని అసోసియేషన్ కట్టారు. దాంతో ఆమెకు ‘మా’ మెంబ‌ర్ షిప్ కార్డ్ లభించనుంది. ఆ కార్డు కారణంగా ఆమెకి నెల‌కు 6 వేల చొప్పున ప్రతినెలా పెన్షన్ రూపంలో రానుంది.

    అదేవిధంగా ఎవ‌రైనా ఆర్టిస్ట్ అకాల‌మ‌ర‌ణం చెందితే వారికి 3 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. పావల శ్యామల పేరిట ఇన్సూరెన్స్ కూడా చేయించారు. నిజంగా మెగాస్టార్ పేద కళాకారుల అందరికీ ఇలాంటి సాయాలు చేస్తూనే ఉన్నారు. ఇక మెగాస్టార్ సాయం పై పావల శ్యామల స్పందిస్తూ.. ‘మా చిరంజీవిగారు గతంలో కూడా రెండు ల‌క్ష‌ల రూపాయిలను ఇచ్చారు. ఆ సమయంలో నేను పీకల్లోతు కష్టాల్లో ఉన్నాను. దాంతో తీవ్ర మాన‌సిక వేద‌న‌ను అనుభవించాను.

    అది తెలుసుకుని చిరంజీవిగారు అప్పుడు సాయం చేశారు. నా కుమార్తెకు కాలు విరిగి తీవ్ర ఇబ్బందిలో ఉంటే.. చిరంజీవిగారు ఇచ్చిన ఆ రెండు లక్షల న‌న్ను ఎంతో ఆదుకుంది. ఆ మేలు ఎన్న‌టికీ మ‌ర్చిపోలేను. ఇప్పుడు మళ్ళీ నేను క‌ష్టకాలంలో ఉన్నానని తెలుసుకుని, నా కోసం లక్షా పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టి కార్డు ఇప్పించారు. దాంతో నాకు ప్రతి నెలా ఆరువేల రూపాయలు వచ్చేలా సాయపడ్డారు. మ‌న‌స్ఫూర్తిగా చిరంజీవి గారికి నా ధ‌న్య‌వాదాలు” అంటూ పావలా శ్యామల ఎమోషనలైంది.

    ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమెకి నెలా నెలా పెన్షన్ అందిస్తోంది. ఐతే గత మూడు నెలలుగా పెన్షన్ డబ్బులు అందడం లేదట. ప్రస్తుతం ఆమె కష్టాలు మరింతగా పెరిగాయని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి.