ఇప్పటికే నిపుణులు ఈ విషయమై హెచ్చరికలు చేస్తుండగా.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీవాల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కేంద్రాన్ని అప్రమత్తం చేసిన కేజ్రీవాల్.. సింగపూర్ లో కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిందని, వెంటనే ఆ దేశానికి విమాన సర్వీసులు నిలిపేయాలని కోరారు. అక్కడి నుంచి వచ్చే విమానాలను కూడా అడ్డుకోవాలని కోరారు.
సింగపూర్ నుంచి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో.. చిన్న పిల్లలపై ప్రభావం చూపే సరికొత్త స్ట్రెయిన్ సింగపూర్ లో వెలుగు చూసిందంటూ జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు అలజడి సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై సింగపూర్ స్పందించింది. తమ దేశంలో బయటపడిన వేరియంట్ కారణంగా.. భారత్ కు థర్డ్ వేవ్ ముప్పు ఉందంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించింది.
ఈ మేరకు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలో కొత్త స్ట్రెయిన్ ఏదీ లేదని చెప్పింది. భారత మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని చెప్పింది. బీ.1.617.2 వేరియంట్ వెలుగు చూసిందని, అది కూడా భారత్ నుంచే వచ్చిందని, తమ దేశానికి చెందినది కాదని ప్రకటించింది. భారత్ నుంచి వచ్చిన వైరస్ కారణంగా తామే ఇబ్బందులు పడుతున్నామని, తమ నుంచి కొత్త వేరియంట్ వచ్చిందనే ప్రచారం సరికాదని వ్యాఖ్యానించింది.
కాగా.. సింగపూర్ లో ప్రభావం చూపుతున్న బీ.1.617.2 వేరియంట్ కారణంగా.. అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశంలోని చాలా క్లస్టర్లలో ఈ వైరస్ ఉందని గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా.. అక్కడి పాఠశాలలను, కాలేజీలను ఈ నెల 28 వరకు మూసేస్తున్నట్టు ప్రకటించింది.