ఆ హీరో వల్ల కాదు తన కష్టంతోనే ఎదిగిందట !

బాలీవుడ్ లో హీరోయిన్ గా దిశా పటానికి రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతూ ఉంది. నిజానికి దిశా మొదట తెలుగులోనే వెండితెరకు పరిచయం అయింది. తన అందాలతో తెలుగు తెరను కప్పేసినా.. ఎందుకో ఆమె తెలుగులో క్లిక్ కాలేకపోయింది. అయితే, తెలుగులో ఎదురైనా పరాభవం ఆమెకు చాల విషయాలను నేర్పింది. ఆ విషయాలను అర్ధం చేసుకుని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుని బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక హిందీలో తక్కువ కాలంలోనే ఫుల్ క్రేజ్ ను తెచ్చుకొని.. ప్రస్తుతం […]

Written By: admin, Updated On : May 19, 2021 3:28 pm
Follow us on

బాలీవుడ్ లో హీరోయిన్ గా దిశా పటానికి రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతూ ఉంది. నిజానికి దిశా మొదట తెలుగులోనే వెండితెరకు పరిచయం అయింది. తన అందాలతో తెలుగు తెరను కప్పేసినా.. ఎందుకో ఆమె తెలుగులో క్లిక్ కాలేకపోయింది. అయితే, తెలుగులో ఎదురైనా పరాభవం ఆమెకు చాల విషయాలను నేర్పింది. ఆ విషయాలను అర్ధం చేసుకుని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుని బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక హిందీలో తక్కువ కాలంలోనే ఫుల్ క్రేజ్ ను తెచ్చుకొని.. ప్రస్తుతం హిందీ స్టార్ హీరోల సరసన ఛాన్స్ లను అందిపుచ్చుకుంటూ ముందుకుపోతుంది. అయితే, తన సక్సెస్ కి సంబంధించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది దిశా. అవేంటో ఆమె మాటల్లోనే.. ‘అవును, అందరూ అన్నట్టే, నేను చాలా లక్కీ పర్సన్ అని నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే, చాలా మంది హీరోయిన్లు నాకంటే అందంగా ఉన్నారు. నాకంటే వాళ్లల్లో మంచి టాలెంట్ ఉంది.

కానీ, వాళ్ళకంటే కూడా నాకు బిగ్ ఛాన్స్ లు దక్కాయి. ముఖ్యంగా నాకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే, ఆ పెద్ద ఛాన్స్ లను నేను కరెక్ట్ గా ఉపయోగించుకో గలిగాను. బహుశా నా సక్సెస్ కి అది కూడా ఒక కారణం’ అంటూ చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన ‘రాధే’ సినిమాలో నటించిన ఈ అందాల భామ ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది.

ఇక ఈ హాట్ బ్యూటీ టైగర్ ష్రాఫ్ కి రియల్ గర్ల్ ఫ్రెండ్, అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది. తానూ టైగర్ గర్ల్ ఫ్రెండ్ అవ్వడం వల్లే, నాకు ఆఫర్లు వస్తున్నాయని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే అదంతా అబద్ధం, మా మధ్య ఎప్పుడు సినిమాల టాపిక్ రాదు. అందుకే మళ్ళీ చెబుతున్నాను, కేవలం నా కష్టం, నా లక్ వల్లే నాకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది’ అంటూ దిశా పటాని క్లారిటీ ఇచ్చింది.